Jasprit Bumrah: బుమ్రా అరుదైన ఘనత.. టి20 క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు

బుధవారం ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బుమ్రా ఆరో ఓవర్లో బంతిని అందుకున్నాడు.. ఆ ఓవర్ మొత్తం ఒక్క పరుగు ఇవ్వకుండా ఐర్లాండ్ బ్యాటరీలను కట్టడి చేశాడు.. టి20 మ్యాచ్లలో బుమ్రా కు ఇది 11వ మెయిడిన్ ఓవర్.

Written By: Anabothula Bhaskar, Updated On : June 6, 2024 8:35 am

Jasprit Bumrah

Follow us on

Jasprit Bumrah: టీమిండియా ఏస్ బౌలర్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో.. బుమ్రా ఈ ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్ చరిత్రలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు.

బుధవారం ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బుమ్రా ఆరో ఓవర్లో బంతిని అందుకున్నాడు.. ఆ ఓవర్ మొత్తం ఒక్క పరుగు ఇవ్వకుండా ఐర్లాండ్ బ్యాటరీలను కట్టడి చేశాడు.. టి20 మ్యాచ్లలో బుమ్రా కు ఇది 11వ మెయిడిన్ ఓవర్. గతంలో ఈ రికార్డు భువనేశ్వర్ కుమార్ పేరు మీద ఉండేది. అయితే అతడి రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు..బుమ్రా 63 మ్యాచ్లలో.. 11 ఓవర్లను మెయిడిన్ గా వేశాడు. భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్లలో 10 ఓవర్లను మెయిడిన్ గా వేశాడు ..

అయితే ఈ లిస్టులో ఉగాండా, కెన్యా బౌలర్లు మొదటి స్థానంలో కొనసాగుతుండడం విశేషం. ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లు వేసి టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు. కెన్యా బౌలర్ సోంగొచ్ 12 మెయి డిన్ ఓవర్లు వేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు . అయితే ఐసీసీ టాప్ 8 ర్యాంక్ లలో ఉన్న జట్లలో మెయిడిన్ వేసిన బౌలర్ గా బుమ్రా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

కాగా, బుధవారం ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బుమ్రా (2/6) అదిరిపోయే బౌలింగ్ వేశాడు. నిప్పులు జరిగే బంతులు వేస్తూ ఐర్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు . మైదానంపై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ.. బంతుల నుంచి స్వింగ్ రాబట్టాడు. బుమ్రా బౌలింగ్లో ఐర్లాండ్ బ్యాటర్లు కనీసం బంతిని టచ్ చేయాలంటేనే భయపడ్డారు.