India vs England : ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో రెండు రోజుల ఆట ముగిసింది. ఇంక మిగిలిన మూడు రోజుల్లో ఏ టీమ్ ను విజయం వరిస్తుంది అనేది తెలియబోతుంది. ఇక ఇప్పటివరకు అయితే ఇండియన్ టీం 171 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పుడు ఇండియన్ టీం బ్యాట్స్ మెన్స్ భారీ పరుగులు చేయగలిగితే ఈ మ్యాచ్ లో ఇండియా ఈజీగా విజయం సాధిస్తుంది. రేపు ఫుల్ డే ఇండియా ఆడి ఒక 450 పరుగుల వరకు లీడ్ లో పెట్టినట్లయితే మిగిలిన రెండు రోజుల్లో ఇంగ్లాండ్ టీమ్ ను ఈజీగా ఆల్ అవుట్ చేయొచ్చు. కాబట్టి రేపు జరిగే మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగబోతుంది.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియన్ టీం భారీ పరుగులు చేసే దిశగా ముందుకు కలుగుతుంటే, ఇంగ్లాండ్ మాత్రం ఇండియాని తొందరగా కట్టడి చేసి ఆలౌట్ చేయాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టు గా తెలుస్తుంది. ఇక ఒకరిని మించిన ఎత్తులు మరొకరు వేస్తూ రేపు మ్యాచ్ ను కొనసాగించబోతున్నట్టుగా అర్థమవుతుంది. మరి దీంట్లో ఎవరు భారీ స్కోర్ చేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇది ఇలా ఉంటే రెండో రోజు బుమ్రా కళ్ళు చెదిరే స్పెల్ వేస్తూ ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేయడంలో 100% సక్సెస్ అయ్యాడు. ఇక రెండో రోజు జరిగిన మ్యాచ్ లో బుమ్రా హీరో అయ్యాడు. మరి మూడో రోజు హీరోగా ఎవరు నిలుస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన జైశ్వాల్ ప్రస్తుతం 15 పరుగులు చేసి ఆల్రెడీ క్రేజ్ లోనే ఉన్నాడు.
కాబట్టి తను మరొకసారి లాంగ్ ఇన్నింగ్స్ కనుక ఆడగలిగితే ఇండియా ఈజీగా గెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మొదటి మ్యాచ్ లో కూడా ఇండియా 190 పరుగుల ఆధిక్యం లో ఉండి సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. కానీ తీరా చివరికి చూస్తే ఇంగ్లాండ్ ఇండియా ని బోల్తా కొట్టించి ఘనవిజయాన్ని సాధించింది. అందుకే ఇంగ్లాండ్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు బస్ బాల్ గేమ్ ఆడటం లో రాటు తేలి ఉన్నారు.
ఇక ఇండియన్ ప్లేయర్లు ఇవన్నీ దృష్టి లో పెట్టుకొని రేపు భారీ పరుగులు చేయగలిగితేనే ఇండియా విజయం అనేది తద్యమవుతుంది. ఇక లేకపోతే మాత్రం మళ్లీ ఫస్ట్ మ్యాచ్ లో ఏదైతే సీన్ రిపీట్ అయిందో అదే సీన్ ను ఇంగ్లాండ్ మళ్ళీ ఈ మ్యాచ్ లో కూడా రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…కాబట్టి ఇండియన్ టీమ్ ప్లేయర్లు బాగా ఆడి వాళ్ల సత్తా చాటుకోవల్సిన సమయం అయితే ఆసన్నమైంది…