ING Vs ENG: బట్లర్ సేనతో తలపడే ఈ 3 వన్డేల సిరీస్ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(team India captain Rohit Sharma)కు, విరాట్ కోహ్లీ(Virat Kohli)కి అత్యంత ముఖ్యం. ఎందుకంటే వారిద్దరూ తమ పూర్వఫామ్ అందుకోవడానికి ఇదే చివరి అవకాశం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వారిద్దరికీ చేదు గణాంకాలనే ఇచ్చింది. ఇక రోహిత్ ఇటీవల రంజి మ్యాచ్లో ఆడాడు. జమ్ము కాశ్మీర్ జట్టుపై ఆడిన అతడు 3, 28 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ రైల్వేస్ జట్టుపై ఆరు పరుగులు మాత్రమే చేసి క్లీన్ బోల్డ్ అయ్యాడు. అయితే వన్డే ఫార్మాట్లో రోహిత్, విరాట్ మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తుంటారు. గత ఏడాది ఆగస్టులో శ్రీలంకపై రోహిత్ 3 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 157 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత అతడు తన క్రమక్రమంగా కోల్పోయాడు. విరాట్ కూడా పెద్దగా గొప్ప ఇన్నింగ్స్ ఆడలేదు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్లో వన్డేలలో వేగంగా 14 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు అతడు తహతహలాడుతున్నాడు. మరో 94 పరుగులు చేస్తే విరాట్ ఈ మైలురాయి అందుకుంటాడు. ఇటీవల కాలంలో ఆఫ్ సైడ్ అవతలి బంతులను ఆడటంలో విరాట్ విఫలమవుతున్నాడు. ఆ బలహీనతను త్వరగా అధిగమించడానికి అతడు ప్రయత్నించాల్సి ఉంది. దానిని అధిగమిస్తే విరాట్ నుంచి పరుగుల వరదను ఆశించవచ్చు.. మరోవైపు ఈ సిరీస్ లో కనుక విరాట్, రోహిత్ తమ పూర్వపు ఫామ్ ను ప్రదర్శిస్తే టీమిండియా కు అడ్డు అనేది ఉండదు. ఇక ఇదే అభిప్రాయాన్ని మాజీ ఆటగాడు సురేష్ రైనా కూడా వ్యక్తం చేశాడు.
గాయాల నుంచి బరిలోకి
టీమిండియాలో ముగ్గురు బౌలర్లు గాయాల నుంచి కోలుకొని ఈ సిరీస్ ద్వారా రంగంలోకి దిగబోతున్నారు.. బుమ్రా సిడ్ని టెస్ట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. అయితే చివరి వన్డేలో బుమ్రా ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ తర్వాత కులదీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి దిగబోతున్నాడు.. గత ఆదివారం రంజీ మ్యాచ్ ఆడిన అతడు.. మూడు వికెట్లు పడగొట్టాడు. అలాగే పేస్ బౌలర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) ఏడాది గ్యాప్ తర్వాత డొమెస్టిక్, ఐదు టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ (champions trophy) ని పరిగణలోకి తీసుకుంటే అర్ష్ దీప్ సింగ్ సామర్థ్యం కూడా కీలకమవుతుంది.
ఆ బాధ్యతలు ఎవరికో?
రోహిత్, గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగినన్నారు. విరాట్, శ్రేయస్ అయ్యర్ తర్వాత స్థానాలలో బ్యాటింగ్ కు దిగుతారు. అయితే ఇందులో వికెట్ కీపర్ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.. అయితే ఈ సిరీస్ మాత్రమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ లోను ఐదవ స్థానం కోసం రిషబ్ పంత్ – కేఎల్ రాహుల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. 2023 ఆగస్టు నుంచి ఈ ఫార్మాట్లో రాహుల్ టీమిండియా కు వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్నాడు.. కారు ప్రమాదం నుంచి కోరుకున్న తర్వాత గత ఏడాది ఆగస్టు నెలలో శ్రీలంక జట్టుతో జరిగిన మూడో మ్యాచ్లో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేశాడు. అప్పుడు అతడు ఆరు పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో కేఎల్ రాహుల్ మొత్తం పది ఇన్నింగ్స్ లలో 276 పరుగులు చేస్తే.. రిషబ్ పంత్ తొమ్మిది ఇన్నింగ్స్ లలో 255 పరుగులు చేశాడు. వీరిద్దరికి ఇటీవల ఇంగ్లాండ్ తో ముగిసిన టి20 సిరీస్ లో అవకాశం లభించలేదు. ఒకవేళ గనుక తాజా సిరీస్లో రాహుల్ కు గనుక అవకాశం లభిస్తే..టాప్ -6 లో ఎడమ చేతి వాటం బ్యాటర్ ఉండే అవకాశం లేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా స్పిన్ ఆల్ రౌండర్ లలో ఒకరిని ప్రమోట్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.. అదే గనక ఇద్దరిని తీసుకుంటే శ్రేయస్ పై వేటు తప్పకపోవచ్చు. అప్పుడు రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడతాడు.