India Vs England 5th Test: ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదవ టెస్టులో ఆసక్తి కర సన్నివేశం చోటుచేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన 218 పరులకు ఆల్ అవుట్ అయింది. మైదానం పాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందనే నమ్మకంతో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి వికెట్ కు డకెట్, క్రావ్ లే 64 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కొద్దిగా ప్రభావం చూపించకపోవడంతో ఇంగ్లాండ్ జట్టు 218 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ జట్టులో క్రావ్ లే(79) మాత్రమే ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లు అంతగా ప్రభావం చూపించలేకపోయారు.
ఈ మైదానం పేస్ బౌలర్లకు అనుకూలిస్తుందని చెప్పినప్పటికీ.. భారత స్పిన్నర్లు క్యూరేటర్ చెప్పింది తప్పని నిరూపించారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో భారత పేస్ బౌలర్లు సిరాజ్, బుమ్రా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కానీ స్పిన్నర్ కులదీప్ యాదవ్ ఇంగ్లాండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. టాప్ బ్యాటర్లు క్రావ్ లే, డకెట్, పోప్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ వంటి వారిని పెవిలియన్ పంపించాడు. ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును కోలుకోకుండా చేశాడు. ఇతడికి రవిచంద్రన్ అశ్విన్ కూడా తోడు కావడంతో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అశ్విన్ హార్ట్ లీ, మార్కువుడ్, అండర్సన్, రూట్ వికెట్లు తీశాడు. కెరియర్లో 100 టెస్ట్ ఆడుతున్న అశ్విన్ నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. మరో స్పిన్నర్ జడేజా కూడా ఒక వికెట్ పడగొట్టి ఆకట్టుకున్నాడు.
ఇంగ్లాండ్ 218 పరుగులకే ఆల్ అవుట్ కావడంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ లోకి బయలుదేరింది. వాస్తవంగా క్రికెట్ నిబంధనల ప్రకారం ఐదు వికెట్లు తీసిన బౌలర్ ముందుగా వెళుతుంటే.. అతడిని మిగతా ఆటగాళ్లు అనుసరిస్తారు. ఈ ప్రకారం కులదీప్ యాదవ్ ముందుగా నడవాలి. అయితే కెరియర్లో 100 వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ ను ముందు నడవాలని కులదీప్ కోరాడు. దానికి అతడు వారించి.. “నువ్వు కీలకమైన ఇంగ్లాండ్ ఆటగాళ్ల వికెట్లు తీశావు. ముందు నడిచే అర్హత నీకే ఉందంటూ” కులదీప్ తో చెప్పాడు. దీంతో అశ్విన్ మాటకు ఒప్పుకున్న కులదీప్ చివరికి తనే ముందు నడిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “ఐదు వికెట్లు తీసినప్పటికీ.. ముందు నడిచే అవకాశం లభించినప్పటికీ.. అశ్విన్ కోసం కులదీప్ తన క్రెడిట్ త్యాగం చేయాలనుకున్నాడు. కానీ అశ్విన్ పెద్ద మనసుతో దానిని ఒప్పుకోలేదు. ఇద్దరు ఆటగాళ్లు తమ ప్రవర్తనతో మా మనసు దోచుకున్నారని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ వీడియో ఇప్పటికే వేల సంఖ్యలో వ్యూస్ దక్కించుకుంది.
A lovely moment in Dharmasala.
– Kuldeep took the ball from the umpire after the innings and gave it to Ashwin then Ashwin gave it back to Kuldeep and then again Ashwin gave back to Kuldeep to take India off the field. pic.twitter.com/vn2WESAN4x
— Johns. (@CricCrazyJohns) March 7, 2024