https://oktelugu.com/

Ashu Reddy: అషురెడ్డితో ఆ స్టార్ సింగర్ కి ఉన్న బంధం ఏమిటీ? ఆసక్తిరేపుతున్న పోస్ట్!

ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక రాహుల్ పర్సనల్ లైఫ్ గురించి తరచుగా రూమర్స్ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రాహుల్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : March 7, 2024 / 03:13 PM IST

    Ashu Reddy and Rahul Sipliganj

    Follow us on

    Ashu Reddy: రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ టాప్ సింగర్స్ లో ఒకడు. ఆయన ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ ఉంటాడు. మొదట్లో యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి టైటిల్ గెలిచాడు. దీంతో రాహుల్ కి మరింత క్రేజ్ పెరిగింది. రాహుల్ కి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పడే అవకాశాలు వచ్చాయి. అలా ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ లెవల్ కి ఎదిగాడు.

    కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక రాహుల్ పర్సనల్ లైఫ్ గురించి తరచుగా రూమర్స్ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రాహుల్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. గతంలో రాహుల్ – అషు రెడ్డి లవర్స్ అని రూమర్స్ వచ్చాయి. అప్పట్లో వీళ్లిద్దరు చాలా క్లోజ్ గా ఉండేవారు. అషురెడ్డి రాహుల్ తో కలిసి దిగిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసేది.

    దీంతో రాహుల్ – అషురెడ్డి మధ్య ఏదో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అనంతరం మనస్పర్థలు రావడంతో కొంత కాలం వాళ్ళు దూరంగా ఉన్నారని, వాళ్ళ స్నేహితులు చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్ గా రాహుల్ సిప్లిగంజ్ అషు తో దిగిన ఫోటోలు షేర్ చేశాడు. అషు కూడా రాహుల్ తో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ” ఆల్ వేస్ మై బెస్టి ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

    మళ్ళీ మీరిద్దరూ కలిసి పోయారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో మళ్లీ అషు రెడ్డి రాహుల్ ని టార్గెట్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 లో రతిక రోజ్ .. రాహుల్ తన మాజీ ప్రియుడని పరోక్షంగా చెప్పి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ ఆమెకు కౌంటర్లు ఇస్తూ వార్తల్లో నిలిచాడు.