India vs England 3rd Test: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో పుంజుకున్న టీమిండియా మూడో టెస్టులో సత్తా చాటాలనుకుంటోంది. గురువారం(ఫిబ్రవరి 15) నుంచి రాజ్‌కోట్ వేదికగా జరిగే టెస్టుకు సిద్ధమవుతోంది.
అయ్యర్, ఆవేశ్‌ఖాన్‌పై వేటు..
చివరి మూడు టెస్టులకు జట్టులో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. శ్రేయస్ అయ్యర్, ఆవేశ్‌ఖాన్‌ను తప్పించింది. ఆకాశ్‌దీప్‌కు అవకాశం కల్పించింది. గాయాలతో రెండు టెస్టులకు దూరమైన రవీంద్రజడేజా, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులో చేరారు. అందరూ ఊహించినట్లుగాకే కింగ్ కోహ్లి మిగతా మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు.
బౌలింగ్ కాంబినేషన్ ఎలా..
ఇక మూడో టెస్టులో టీమిండియా బౌలింగ్ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌తోనైనా సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన తెలుగు తేజం కేఎస్. భరత్‌పై మూడో టెస్టులో వేటు పడే అవకాశం ఉంది. నాలుగు ఇన్నింగ్స్‌లో భరత్ కేవలం 41, 28, 17, 6 పరుగులే చేశాడు. కీపింగ్‌లోనూ తడబడ్డాడు. సునాయాస స్టంప్ ఔట్స్‌ను చేజార్చాడు. ఈ క్రమలలో భరత్‌ను తప్పించి ధృవ్ జురెల్‌ను ఆడించే అవకాశం ఉంది. అయితే జట్టులో అనుభవం లేని ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం ధృవ్ జురెల్‌కు ప్రతికూలంగా మారింది. ఈ ఒక్క కోణంలో ఆలోచిస్తే భరత్ మరో ఛాన్స్ రావొచ్చు.
సర్ఫరాజ్‌ఖాన్ డౌటే..
డొమెస్టిక్ సెన్సేషన్ సర్ఫరాజ్‌ఖాన్ ఈ మ్యాచ్‌తో అయినా అరంగేట్రం చేస్తాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన శ్రేయస్‌పై వేటుపడడంతో సర్ఫరాజ్‌కు లైన్ క్లియర్ అయింది. కానీ, సర్ఫరాజ్‌కు కేఎల్ రాహుల్ నుంచి పోటీ నెలకొంది. అతను ఫిట్‌గా లేకపోతే రజత్ పటీదార్‌తోపాటు సర్ఫరాజ్ బరిలో దిగే అవకాశం ఉంటుంది.
సిరాజ్.. ఆకాశ్‌దీప్?
పేస్ బౌటింగ్‌లో మహ్మద్ సిరాజ్ రెండో టెస్టుకు దూరం పెట్టారు. మూడో టెస్టులో సిరాజ్‌తోపాటు ముఖేశ్‌కుమార్, ఆకాశ్‌దీప్ పోటీ పడుతున్నారు. తొలి టెస్టులో సిరాజ్, రెండో టెస్టులో ముఖేశ్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇంగ్లండ్ లయన్స్‌తో అదరగొట్టిన బెంగాల్ పేసర్ ఆకాశ్‌దీప్‌ను బీసీసీఐ మూడు టెస్టులకు ఎంపిక చేసింది. ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న ఇతనికి చాన్స్ ఇస్తే, సిరాజ్, ముఖేశ్ బెంచ్‌కే పరిమితం అవుతారు. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటే సిరాజ్‌కు ఛాన్స్ దక్కుతుంది. అజయ్ జడేజా ఫిట్‌నెస్ సాధిస్తే కుల్దీప్‌ను తప్పించే అవకాశం ఉంది. స్పిన్నర్లుగా అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ జట్టులో కొనసాగుతారు. బ్యాటింగ్ విభాగంలో రోహిత్, యశస్వి ఓపనెనర్లుగా బరిలో దిగనుండగా గిల్ ఫస్ట్ డౌన్ ఆడనున్నాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్‌కు మూడో టెస్టు చాలా కీలకం.
భారత తుది జట్టు(అంచనా)..
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌గిఇల్, కేఎల్.రాహుల్, రజత్ పటీదార్/సర్ఫరాజ్‌ఖాన్, అక్షర్ పటేల్, కేఎస్‌భరత్/ధృవ్‌జురెల్, రవీంద్ర జడేజా/కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/ఆకాశ్‌దీప్.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: India vs england 3rd test dhruv jurel likely to replace ks bharat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com