Medaram Jathara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మరో వారం రోజుల్లో మొదలు కానుంది. ఈమేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే నిత్యం వేల మంది భక్తులు మేడారం వెళ్లి వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర జరిగే ఐదు రోజుల్లో కోటి మందికిపైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భక్తుల కోసం అధికారిక వెబ్‌సైట్, ఆండ్రాయియ్ యాప్‌ను విడుదల చేసింది. వీటిలో మేడారం జాతరకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్ ఇదీ..
మేడారం అధికారిక వెబ్‌సైట్ https://www.medaramjathara.com , ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ను ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆవిష్కరించారు జాతరలో ప్రత్యేక మొబైల్ యాప్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా భక్తులకు తాగునీటి వసతి స్థలాలు, మేడారం జాతర రూట్ మ్యాప్, జాతరలో తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెలుసుకునే పాయింట్లు, ప్రమాదాల సంఘటనల స్థలాలను తెలిపే అవకాశం, దర్శనం క్యూలైన్, పార్కింగ్ ప్లేస్, కోవిడ్ –19 టీకాలు వేసేందుకు వ్యాక్సినేషన్ పాయింట్లు, మెడికల్ క్యాంపులు, టాయిలెట్స్ పాయింట్స్, జిల్లా లోని పర్యాటక ప్రదేశాలు తెలుసుకోవచ్చు.
భక్తుల సూచనతోనే..
భక్తుల సలహాలు, సూచనల మేరకే ఈ యాప్‌ను రూపొందించారు. జాతర విశిష్టత, వేడుకల ప్రత్యక్ష ప్రసారం కూడా ఈ యాప్, వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు. పోలీసు రక్షణ విభాగంలో ట్రాఫిక్ మార్గదర్శకాలు, సహాయ కేంద్రాలు, టీఎస్ ఆర్టీసీ బస్సు సౌకర్యాలు మరియు బస్సుల బయల్దేరు సమయం, బస్సు చార్జీలు, బస్సు స్టేజిల వివరాలు, అమ్మవార్లకు శ్రేష్ఠమైన ఎత్తు బంగారం (బెల్లం ) ధరల వివరాలు, హెల్ప్ లైన్ నెంబర్స్ ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే విధంగా రూపొందించారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: A special guide app for medaram jatara devotees
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com