India Vs Canada: మరో విజయంపై భారత్ కన్ను.. కెనడా తో మ్యాచ్ లో జట్టులో సమూల మార్పులు..

గ్రూప్ - ఏ లో భారత్ ముందుగా సూపర్ -8 కు వెళ్ళింది. అయితే శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో ఐర్లాండ్ - అమెరికా మధ్య మ్యాచ్ రద్దయింది. దీంతో అమెరికాకు ఒక పాయింట్ లభించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 15, 2024 1:18 pm

India Vs Canada

Follow us on

India Vs Canada: టి20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించి.. సూపర్ -8 కు దూసుకెళ్లింది టీం ఇండియా. ఇప్పటికే గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో కొనసాగుతూ… టైటిల్ ఫేవరెట్ గా బరిలో ఉంది.. అయితే ఈ జట్టు తన గ్రూప్ స్టేజిలోని చివరి మ్యాచ్ శనివారం ఆడనుంది. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో సెంట్రల్ బ్రో వార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో కెనడాతో భారత జట్టు తలపడుతుంది.. అనామక మ్యాచ్ అయినప్పటికీ.. ఎలాగైనా గెలవాలనే కసితో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ ద్వారా పెద్దగా ఫలితం లేకపోయినప్పటికీ.. సూపర్ -8 కు ముందు కొంతమంది ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలని రోహిత్ భావిస్తున్నాడు.

గ్రూప్ – ఏ లో భారత్ ముందుగా సూపర్ -8 కు వెళ్ళింది. అయితే శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో ఐర్లాండ్ – అమెరికా మధ్య మ్యాచ్ రద్దయింది. దీంతో అమెరికాకు ఒక పాయింట్ లభించింది. పాయింట్ల ప్రకారం చూసుకుంటే అమెరికా పాకిస్తాన్ కంటే ఒక మెట్టు పైనే ఉంది. దీంతో ఆ జట్టు సూపర్ -8 కు వెళ్లిపోయింది. అయితే భారత జట్టుకు టి20 వరల్డ్ కప్ లో ఓపెనింగ్ అనేది తీవ్ర సమస్యగా మారింది.. రోహిత్ తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వస్తున్నప్పటికీ.. ఆశించినంత స్థాయిలో ప్రభావం చూపించడం లేదు. దీంతో అతనికి విశ్రాంతి ఇచ్చి.. సూపర్ -8 లో ఆడించాలని రోహిత్ భావిస్తున్నాడు.. ఎందుకంటే సూపర్ – 8 లో విరాట్ కోహ్లీ ఫామ్ జట్టుకు అత్యంత అవసరం.

ఇక విరాట్ కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా సంజు సాంసన్ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మరో స్టార్ బౌలర్ బుమ్రా కు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది.. సూపర్ -8 మ్యాచ్ లు మొత్తం వెస్టిండీస్ వేదికగా జరగనున్నాయి. బుమ్రా కు విశ్రాంతి ఇచ్చి కులదీప్ లేదా యజువేంద్ర చాహల్ లో ఒకరికి అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఎలాగూ ప్రాధాన్యం లేని మ్యాచ్ కాబట్టి హార్దిక్ పాండ్యాకు కూడా విశ్రాంతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వన్డే వరల్డ్ కప్ లో హార్దిక్ గాయపడ్డాడు. ఆ తర్వాత జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అమెరికా మైదానాలు ఎలా టర్న్ అవుతాయో అంతు పట్టడం లేదు. ఒకవేళ హార్థిక్ గాయపడితే జట్టుకు తీవ్రంగా నష్టం ఉంటుంది. అందువల్లే అతడికి రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఇక ఫ్లోరిడాలో వాతావరణం పూర్తిగా మారిపోవడంతో.. వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మైదానంపై జరగాల్సిన అమెరికా – ఐర్లాండ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.