Malaria: మలేరియా కేసులు పెరిగే సమయం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

శక్తివంతమైన ఇంటి వస్తువుల్లో పసుపు ముందు వరసలో ఉంటుంది. ఇందులో అద్భుతమైన యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-మైక్రోబయల్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

Written By: Swathi Chilukuri, Updated On : June 15, 2024 1:11 pm

Malaria

Follow us on

Malaria: వర్షాలు పడుతున్నాయంటే ముఖ్యంగా దోమల బెడదనే గుర్తుకు వస్తుంది. ఇంట్లో ఎంత శుభ్రంగా ఉన్నా సరే ఇంటి బయట చెత్త చెదారం ఉంటే దోమలు ఎక్కువ అవుతాయి. వీటి వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే మలేరియాను నివారించడానికి మన పరిసరాలు, ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవడం మొదట చేయవల్సిన పని. నీరు నిల్వ ఉండే వాటిని వెంటనే తొలగించడం చాలా ముఖ్యం. మలేరియా నివారణకు ఇంటి చిట్కాలను కూడా పాటించడం అవసరం.

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ మలేరియా నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. వేడినీటిలో, దాల్చిన చెక్క, నల్ల మిరియాల పొడిని వేసుకొని తాగితే సరిపోతుంది. రుచి కోసం తేనెను కూడా ఉపయోగించవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగుతూ.. మంచినీళ్లు కూడా తగినంత తాగాలి.

పసుపు: శక్తివంతమైన ఇంటి వస్తువుల్లో పసుపు ముందు వరసలో ఉంటుంది. ఇందులో అద్భుతమైన యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-మైక్రోబయల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్లాస్మోడియం ఇన్ఫెక్షన్ కారణంగా శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను పసుపు సులభంగా తొలిగిస్తుంది. పసుపుతో కూడా మలేరియా పరాన్నజీవిని నాశనం చేయవచ్చు. మలేరియా తరచుగా కండరాల, కీళ్ల అసౌకర్యాన్ని కలిగిస్తుంటుంది.

ఆరెంజ్ జ్యూస్: మలేరియా ఉన్నవారు భోజనం తర్వాత ఈ ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరెంజ్ జ్యూస్ జ్వరాన్ని తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది. మలేరియా ఉంటే రోజులో 2 నుంచి 3 గ్లాసుల తాజా నారింజ రసం తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

తులసి: ఆయుర్వేద చికిత్సలో, మలేరియా సంకేతాలు, తీవ్రతను తగ్గించడానికి తులసి చాలా ఉపయోగపడుతుంది. తులసిలో సీజనల్, బాక్టీరియా వ్యాధుల నిర్మూలనలో సహాయం చేస్తుంది. దీన్ని మిరియాల పొడితో కలిపి తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.