India Vs Australia World Cup Final: వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అయితే ఈ పిచ్ ఎక్కువగా బౌలింగ్ కి అనుకూలిస్తు ఉండటం తో బ్యాట్స్ మెన్స్ ఎక్కువ పరుగులు చేయలేకపోతు ఉన్నారు దానివల్ల ఇండియన్ టీం వరుసగా వికెట్లను కోల్పోతూ మ్యాచ్ లో ఏమాత్రం ప్రభావం చూపించకుండా చాలా నత్తనడకన స్కోర్ ను నడిపించింది.
ఇక ఈ మ్యాచ్ చూసిన చాలా మంది అభిమానులు ఈ మ్యాచ్ ని ఈ పిచ్ లో ఎందుకు పెట్టారు అంటూ తీవ్ర ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ అంటే భారీ స్కోరు చేసే దిశగా ఉంటే చూసే అభిమానులకైనా ఆ మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ అలా కాకుండా ఇలాంటి పిచ్ ల పైన మ్యాచ్ ఆడితే చూసే ఇంట్రెస్ట్ కూడా ఎవరికీ ఉండదు అందువల్ల ఫైనల్ మ్యాచ్ ని ఇక్కడ కాకుండా వేరే పిచ్ లో పెడితే బాగుండేది…
భారీ స్కోరు చేసినప్పుడే మ్యాచ్ మీద చూడాలని ఇంట్రెస్ట్ గాని ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ గాని పెరుగుతూ ఉంటుంది.ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ మ్యాచ్ ని చూసినంతసేపు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కానీ ఇలాంటి పిచ్ లో మ్యాచ్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో రాహుల్ ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు ఇక తనదైన రీతిలో టీమ్ స్కోర్ ని పరుగులు పెట్టించాడు.
అప్పటికి తనొక్కడే ఒంటరి పోరాటం చేయడం అనేది చూసిన ప్రతి అభిమాని కూడా రాహుల్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయారు. కానీ దురదృష్టవశాత్తు 66 పరుగులు చేసిన రాహుల్ ఔట్ అయి పోయాడు…ఇక పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ ని ఆడలేక అడుతు ముందుకు సాగుతుంది…ఇక ఇలాంటి క్రమం లోనే ఇండియా టీమ్ లో స్కోరింగ్ గేమ్ ఆడబోతుంది అనేది అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది.
ఇక ఇండియన్ టీమ్ ఈ ఫైనల్ లో గట్టెక్కాలి అంటే ఇండియన్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేసి ఆస్ట్రేలియన్ ప్లేయర్ల వికెట్లు తీస్తే తప్ప ఈ మ్యాచ్ లో ఇండియా విజయం అనేది చాలా కష్టం గా మారనుంది…ఇక బౌలర్ల మీదనే భారం ఉంది వాళ్ల చేతిల్లోనే ఇండియన్ టీమ్ మ్యాచ్ ఆధారపడి ఉంది…