https://oktelugu.com/

Teenmar Mallanna: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వెనక్కి ఇచ్చేస్తాడా..అంటూ తీన్మార్ మల్లన్న ఘాటు కామెంట్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. ఇక పాన్ ఇండియా సినిమాలను చేయడానికి యావత్ ఇండియన్ సినిమా హీరోలందరు పోటీపడుతున్న క్రమంలో మన తెలుగు సినిమా హీరోలు మాత్రం భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ ఇప్పుడు పెను ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి. అయితే ఆయన కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని ఎక్కువగా చేయడం లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : December 14, 2024 / 01:45 PM IST

    Teenmar Mallanna

    Follow us on

    Teenmar Mallanna: పుష్ప 2 సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కున్నాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన సంఘటనతో అల్లు అర్జున్ ఒకరోజు పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఎట్టకేలకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఈరోజు పొద్దున ఆయన తన ఇంటికి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ ని కలిశాడు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న చాలా ఘాటుగా మాట్లాడారు… ఇక ఆయన మార్నింగ్ న్యూస్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ మీద ఫైర్ అయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘నేషనల్ అవార్డు’ అల్లు అర్జున్ ఒక్కడికే ఉండాలనే ఉద్దేశ్యంతోనే జానీ మాస్టర్ మీద కుట్ర పన్ని ఆయనకు వచ్చిన ‘నేషనల్ అవార్డు’ ని వెనక్కి తీసుకునేలా చేసిన దాంట్లో అల్లు అర్జున్ కూడా ఒకరు అంటూ కామెంట్లు చేశాడు… ఇక అలాగే అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ ఇప్పుడు మీరు కూడా ఒకరోజు పాటు జైల్లో ఉన్నారు. మరి మీ ‘నేషనల్ అవార్డు’ ను వెనక్కి ఇచ్చేస్తారా అంటూ ప్రశ్నించాడు. ఇక అలాగే సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఎదగనివ్వాలి లేదంటే ఈరోజు కాకపోతే రేపైనా మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు.

    ఇక ఇప్పటికి మీరు కూడా ఒక్కరోజు పాటు జైల్లో అయితే ఉన్నారు కదా! ప్రతి ఒక్కరికి కాలమే సమాధానం చెబుతుంది అంటూ ఆయన అల్లు అర్జున్ మీద ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమా గురించి కూడా మాట్లాడుతూ కొన్ని అభ్యంతరకరమైన వాక్యాలను కూడా చేశాడు.

    పుష్ప 2 సినిమా ద్వారా సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు. ప్రేక్షకులను ఎర్రచందనం దొంగలుగా మారండని మెసేజ్ ఇస్తున్నారా? అలాంటి ఇల్లీగల్ పనులను చేసే సినిమాలు ఎందుకు చేస్తున్నారు? అందులో నటించిన మీకు నేషనల్ అవార్డు ఎలా వచ్చింది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ అభిమానులు మాత్రం తీన్మార్ మల్లన్న మీద తీవ్రమైన వ్యతిరేకతను చూపిస్తున్నారు.

    ఇక ఒక రకంగా చూసుకుంటే మల్లన్న మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు అంటూ కొంతమంది అతన్ని సమర్థిస్తుంటే మరి కొంతమంది మాత్రం ఇలాంటి సందర్భంలో మల్లన్న అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన విషయం కాదు అంటూ వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఈ కేసు విషయంలో ఎక్కడ దాకా వెళ్తారనేది తెలియాల్సి ఉంది…