Sanju Samson: టీ20లో రికార్డు లకంటే ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనకే మేనేజ్మెంట్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే మ్యాచ్ లలో గొప్పగా బ్యాటింగ్ చేయాలి. అద్భుతంగా ఫీల్డింగ్ చేయాలి. అనితర సాధ్యం అన్నట్టుగా బౌలింగ్ చేయాలి.
టీ20 వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో అటగాళ్లు గొప్పగా ఆడాలి. అప్పుడే జట్టుకు విజయాలు సాధ్యమవుతాయి. ప్రస్తుతం టీమిండియాలో గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. గొప్పగా చెప్పుకునే స్థాయిలో ఆడటం లేదు. అందువల్లే టీమిండియా ప్రస్తుత టీ 20 వరల్డ్ కప్ లో భారీగా పరుగులు నమోదు చేయలేకపోయింది. చివరికి సొంత మైదానాలలో కూడా బీభత్సమైన పరుగులు చేయలేకపోయింది.
టీమిండియాలో తిలక్ వర్మ, అభిషేక్ శర్మ గొప్ప ఆటగాళ్లు. వీరిద్దరూ విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేస్తుంటారు. అనేక మ్యాచ్ లలో వారిద్దరు తాము ఏమిటీ నిరూపించుకున్నారు. టీ 20లలో అభిషేక్ శర్మ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. తిలక్ వర్మ గత ఆసియా కప్ లో పాకిస్థాన్ మీద తిరుగు లేని స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ భీకరమైన ఫామ్ లో ఉండటంతో మేనేజ్మేంట్ టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసింది.
అభిషేక్ శర్మ ప్రస్తుత టీ 20 వరల్డ్ కప్ లో వరుసగా మూడు సార్లు డౌకౌట్ అయ్యాడు. తిలక్ వర్మ ఈ టోర్నీలో ఇంతవరకూ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. వీరిద్దరూ సరిగ్గా ఆడకపోవడంతో మేనేజ్మేంట్ సంజు శాంసన్ మీద ద్రుష్టి సారించినట్టు తెలుస్తోంది. అందువల్లే సంజు బ్యాటింగ్ ప్రాక్టిస్ చేస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరిగే సూపర్ 8 మ్యాచ్ లో సంజూ ఆడతాడని తెలుస్తోంది. అందువల్లే అతడు బ్యాటింగ్ ప్రాక్టిస్ చేస్తున్నట్టు సమాచారం. సౌత్ ఆఫ్రికా మీదు సంజుకు మంచి రికార్డు ఉంది. పైగా ఈ మ్యాచ్ ఆహ్మదాబాద్ వేదికగా జరుగుతోంది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. సంజుస్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. అందువల్లే అతడిని ప్లేయింగ్ 11 లోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఒక వేళ సంజును తీసుకుంటే అభిషేక్ లేదా తిలక్ మీద వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది.