Best Electric Scooter: సామాన్యుల ఇంట్లో బైక్ లేదా స్కూటర్ తప్పనిసరిగా మారింది. రోజువారి అవసరాలతో పాటు స్వల్పదూరం ప్రయాణం చేయడానికి స్కూటర్ కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చెబుతున్నారు. ఈ స్కూటర్లు ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంటు లో రావడంతో పెట్రోల్ సమస్య తగ్గడంతో పాటు చార్జింగ్ చేసుకోవడానికి ఇంట్లోనే అనుకూలంగా ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అలాగే మిగతా వాటితో పోలిస్తే ధర కూడా అందుబాటులో ఉండడంతో కొందరు ప్రత్యేకంగా వీటి కోసం ఆరా తీస్తున్నారు. అయితే ఇలాంటి వారికి అనుగుణంగా TVS Orbiter స్కూటర్ బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. ఇందులో ఫాస్టెస్ట్ చార్జింగ్ సౌకర్యంగా ఉండడంతో పాటు ధర కూడా అనుకూలంగా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా 2026 సంవత్సరానికి ఇది బెస్ట్ స్కూటర్ అని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. మరి ఇందులో ఉండే విశేషాలేవో ఇప్పుడు చూద్దాం..
కొత్త సంవత్సరం సందర్భంగా స్కూటర్ కొనాలని అనుకునే వారికి TVS Orbiter బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు కేవలం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా రోజువారి అవసరాలకు ఇది బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా కొత్త ఆర్బిటర్ పై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పట్టణ, నగరాల్లో ఉండేవారు దైనందిన జీవితానికి ఎక్కువగా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్లో మెరుగైన బ్యాటరీని చేర్చారు. ఇందులో 3.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఇది మిగతా స్కూటర్లతో పోలిస్తే మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 15 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ మైలేజ్ తో స్వల్ప దూరంలో ఉన్న వీకెండ్ టూర్లు కూడా వెళ్ళవచ్చు. ఇది స్కూటర్ అయినప్పటికీ యూత్ ను సైతం ఆకట్టుకునే విధంగా డిజైన్ తయారు చేశారు. ఎర్గొనామిక్ డిజైన్ ను కలిగి ఉండడంతో దీనిపై రైడ్ చేస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. అంతేకాకుండా రోజంతా దీనిపై ప్రయాణం చేసినా కూడా ఇలాంటి అలసట అనిపించదు. ముఖ్యంగా ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు స్మూత్ డ్రైవింగ్ ఉంటుంది. దీనికి ఉండే సస్పెన్షన్ తో బరువు కాస్త ఎక్కువగా ఉన్న సులభంగా వెళ్లే విధంగా సహకరిస్తుంది.
ఈ స్కూటర్కు ఉండే బ్యాటరీ ని ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి పరికరాలు అవసరం లేదు. అంతేకాకుండా బయట కూడా టీవీఎస్ ప్రత్యేకంగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఉండే స్మార్ట్ ఫీచర్స్ సౌకర్యవంతంగా ఉంటాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్, నావిగేషన్ ప్రాంప్ట్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటివి సౌకర్యాన్ని ఇస్తాయి. ఈ స్కూటర్ను ప్రస్తుతం మార్కెట్లో రూ.1.05 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. మొదటిసారి స్కూటర్ కొనే వారితో పాటు అదనపు పనుల కోసం స్కూటర్ కావాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.