Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: నారా లోకేష్ మంచి మనసు.. పార్టీలు చూడట్లే!

Nara Lokesh: నారా లోకేష్ మంచి మనసు.. పార్టీలు చూడట్లే!

Nara Lokesh: రాజకీయాలను రాజకీయాలను చూడాలి. ఇతర అంశాలతో వాటిని ముడిపెట్టకూడదు. రాజకీయాల్లో ఉన్నవారు పార్టీలకు అతీతంగా సేవలు అందించాలి. ఆపదలో ఉన్న వారిని చేయూత అందించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంలో అభినందనలు అందుకున్నారు మంత్రి నారా లోకేష్. తనకున్న గొప్ప మనసును చాటుకున్నారు. కష్టంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తకు అండగా నిలిచి సాయం చేశారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని చూసి మంత్రి లోకేష్ సాయం చేసినందుకు ఆ వైయస్సార్ కాంగ్రెస్ […]

Nara Lokesh: రాజకీయాలను రాజకీయాలను చూడాలి. ఇతర అంశాలతో వాటిని ముడిపెట్టకూడదు. రాజకీయాల్లో ఉన్నవారు పార్టీలకు అతీతంగా సేవలు అందించాలి. ఆపదలో ఉన్న వారిని చేయూత అందించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంలో అభినందనలు అందుకున్నారు మంత్రి నారా లోకేష్. తనకున్న గొప్ప మనసును చాటుకున్నారు. కష్టంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తకు అండగా నిలిచి సాయం చేశారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని చూసి మంత్రి లోకేష్ సాయం చేసినందుకు ఆ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆనందించారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

* సోషల్ మీడియాలో యాక్టివ్..
సోషల్ మీడియాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భాస్కరరావు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన తన తండ్రి అనారోగ్య దుస్థితిని సోషల్ మీడియాలో విన్నవించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని.. తన తండ్రి ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని.. నా శక్తి మేరకు ఖర్చు పెట్టానని.. కొంచెం అండగా నిలబడి ఆదుకోండి అంటూ ట్వీట్ చేశాడు భాస్కర్. జగన్ తో పాటు మంత్రి నారా లోకేష్ కు కూడా ట్యాగ్ చేశాడు. నెటిజెన్లను కూడా అర్థించాడు. అయితే వెంటనే స్పందించారు నారా లోకేష్. మీ నాన్నగారికి జరిగిన ప్రమాదం గురించి విని బాధపడ్డాను భాస్కర్. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ నాన్నకు అవసరమైన సహాయాన్ని ఎలా అందించాలో మా టీం చూసుకుంటుంది” అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

* వెంటనే స్పందించిన లోకేష్
నారా లోకేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎవరైనా సహాయం కోసం అందిస్తే వెంటనే స్పందిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో చిక్కుకున్నవారు ముందుగా నారా లోకేష్ కు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇతర పార్టీలకు చెందిన వారు కూడా సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసిన మరుక్షణం స్పందిస్తున్నారు లోకేష్. అయితే తనకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన భాస్కర్ నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ వీటికి రిప్లై ఇచ్చారు. థాంక్యూ నారా లోకేష్ అన్నగారు. పార్టీ చూడకుండా మా నాన్న గారి పరిస్థితి గురించి చెప్పగానే.. ఒక అన్నలా సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నారా లోకేష్ ట్వీట్ వైరల్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper