Homeక్రీడలుక్రికెట్‌India T20 World Cup 2026 Squad: గిల్‌ కు షాక్‌.. ఇషాన్‌ కు ఛాన్స్‌.....

India T20 World Cup 2026 Squad: గిల్‌ కు షాక్‌.. ఇషాన్‌ కు ఛాన్స్‌.. కొత్త వైస్ కెప్టెన్.. టీ20 ప్రపంచకప్‌ నకు టీమిండియా జట్టు ఇదే

India T20 World Cup 2026 Squad: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. పేలవ ఫామ్‌తో టీ20 క్రికెట్‌లో గిల్‌ పెద్దగా ప్రభావం చూపడం లేదు. సారాధిగా కూడా ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో తాజాగా 2026 ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 ప్రపంచకప్‌ జట్టుకు గిల్‌ను ఎంపిక చేయలేదు. టీ20 వరల్డ్‌కప్‌కు బీసీసీఐ జాతీయ జట్టును గురువారం ప్రకటించింది.

సూర్యకుమారే సారథి..
సూర్యకుమార్‌ యాదవ్‌ను కెప్టెన్‌గా కొనసాగుతారు. అక్షర్‌ పటేల్‌ను వైస్‌ కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించింది. ఈ ఎంపికలు యువత ఆధారిత జట్టును సూచిస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌లో వారి ప్రదర్శనలు కీలకం.

ప్రభావం చూపని గిల్‌..
గిల్‌ ఈ ఏడాది జరిగి ఆసికా కప్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. సౌత్‌ఆఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. మరోవైపు ఇటీవలే గాయపడ్డారు. ఫిట్‌నెస్‌ కూడా పూర్తిగా లేనట్లుగా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ, టీం మేనేజ్‌మెంట్‌ గిల్‌ను పక్కన పెట్టింది.

ఇషాన్‌కు చాన్స్‌..
ఇదిలా ఉంటే.. జట్టులోకి ఇషాన్‌ కిషన్‌కు అవకాశం దక్కింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో రాణించిన ఇషాన్‌ను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు. తుది జట్టులో స్థానం కల్పించారు. ఇదిలా ఉంటే టీ20 వరల్డ్‌ కప్‌ భారత్, శ్రీలంక వేదికగా జరుగుతుంది. ఫిబ్రవరి 7న మొదలై మార్చి 8న ముగుస్తుంది. ఫిబ్రవరి 7న భారత్‌ యూఏఈతో ఆడుతుంది. 12న నమీబియా, 15న పాకిస్తాన్‌తో, 18న నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు సూపర్‌ 8 మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్, 5న రెండో సెమీ ఫైనల్‌ జరుగుతుంది. మార్చి 8న ఫైనల్‌ జరుగుతుంది.

పూర్తి జట్టు వివరాలు
సూర్యకుమార్‌ యాదవ్‌(కెప్టెన్‌), అక్షర్‌పటేల్‌(వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, దూబే (శివం), రింకు సింగ్, సంజూ శాంసన్, ఇషాన్‌ కిషన్, అర్షదీప్‌సింగ్, హర్షిత్‌రాణా, కుల్దీప్‌యాదవ్, వరుణ్‌చక్రవర్తి, భువనేశ్వర్‌కుమార్, వాషింగ్‌టన్‌ సుందర్‌.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular