https://oktelugu.com/

చేతులెత్తేసిన టీమిండియా..: మొదటి టెస్టులో ఓటమి

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్ మన్లలో ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. 36 పరుగుల వద్ద షమీ గాయంతో రిటైర్ హార్డ్ గా వెనుదిరగడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా టార్గెట్ 90 పరుగులు. 4,9,2,0,4,0,8,4,0,4.. ఇవి టీమిండియా ఆటగాళ్లు నమోదు చేసిన వరుస స్కోర్లు. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్‌ బాట పట్టారు. Also Read: భారత […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 19, 2020 / 04:15 PM IST
    Follow us on


    ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్ మన్లలో ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. 36 పరుగుల వద్ద షమీ గాయంతో రిటైర్ హార్డ్ గా వెనుదిరగడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా టార్గెట్ 90 పరుగులు. 4,9,2,0,4,0,8,4,0,4.. ఇవి టీమిండియా ఆటగాళ్లు నమోదు చేసిన వరుస స్కోర్లు. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్‌ బాట పట్టారు.

    Also Read: భారత బ్యాట్ మెన్స్ ను ఒక్క ట్వీట్ తో క్లిన్ బోల్డ్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్..!

    ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఎలా సాగిందనడానికి ఈ పరుగులే నిదర్శనం. అసలు ఆడుతోంది అంతర్జాతీయ మ్యాచా.. లేక గల్లీ క్రికెటా అనే అనుమానం కలిగింది. ఏ ఒక్కరూ కూడా డబుల్ డిజిట్ స్కోరు నమోదు చేయలేదంటే మన ఆటగాళ్ల ప్రదర్శనను అర్థం చేసుకోవచ్చు. ఇంతటి మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే అత్యధిక స్కోరంటే ఆశ్చర్యం కలుగకమానదు. హజెల్ వుడ్ ఐదు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ నాలుగు వికెట్లు తీశాడు.

    తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కిందనే ఆనందం టీమిండియాకు ఎంతో సేపు నిలవలేదు. 9/1 క్రితం రోజు స్కోరుతో ఆటను ఆరంభించిన టీమిండియా మూడోరోజు కమిన్స్‌ వేసిన తొలి ఓవర్‌లోనే 2పరుగులు చేసిన నైట్‌వాచ్‌మెన్‌ బుమ్రా వెనుదిరిగాడు. బుమ్రాతో మొదలైన టీమిండియా వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది.

    Also Read: అసీస్ దెబ్బ: కుప్పకూలిన టీమిండియా.. ఓటమి ముంగిట..

    90 లక్ష్యాన్ని ఆసిస్‌ జట్టు అలవోకగా ఛేదించింది. ముఖ్యంగా ఓపెనర్లు మాథ్యూవేడ్‌ 53 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేయగా.. జో బర్న్స్‌ 63 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌‌తో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నిలకడగా ఆడి మొదటి వికెట్‌కే 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వేడ్‌ రనౌట్‌ అయ్యాక.. మార్నస్‌ లబుషేన్‌ ఆరుగులు చేసి ఔటయ్యాడు. చివరికి స్మిత్‌ తో కలిసి బర్న్స్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు డిసెంబర్‌‌ 26న మెల్‌బోర్న్‌ వేదికగా జరుగనుంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్