చంద్రబాబు, జగన్.. ఓ అధికారి బలి!

అధికారం బెల్లం లాంటిది..ఐదేళ్లలో కరిగిపోతూనే ఉంటుంది. నేతలను నమ్ముకొని అధికారులు పనిచేస్తే అంతే సంగతులు అని తేలిపోయింది. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను ముప్పు తిప్పలు పెట్టిన ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు ఎటూకాకుండా అయిపోయారు. జగన్ సర్కార్ ఆగ్రహ జ్వాలల్లో ఆయన బలైపోయారు. ఇప్పుడు కాపాడడానికి చంద్రబాబు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం.. ప్రజాప్రతినిధుల తాత్కాలిక అధికారం అడ్డుపెట్టుకొని అధికారులు దూకుడుగా ప్రవర్తిస్తే  ఎంతటి ఉపద్రవం ఎదురవుతుందో […]

Written By: NARESH, Updated On : December 19, 2020 5:33 pm
Follow us on

అధికారం బెల్లం లాంటిది..ఐదేళ్లలో కరిగిపోతూనే ఉంటుంది. నేతలను నమ్ముకొని అధికారులు పనిచేస్తే అంతే సంగతులు అని తేలిపోయింది. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను ముప్పు తిప్పలు పెట్టిన ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు ఎటూకాకుండా అయిపోయారు. జగన్ సర్కార్ ఆగ్రహ జ్వాలల్లో ఆయన బలైపోయారు. ఇప్పుడు కాపాడడానికి చంద్రబాబు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం..

ప్రజాప్రతినిధుల తాత్కాలిక అధికారం అడ్డుపెట్టుకొని అధికారులు దూకుడుగా ప్రవర్తిస్తే  ఎంతటి ఉపద్రవం ఎదురవుతుందో ఏబీ వెంకటేశ్వరరావు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: గన్నవరం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను  చాలా ఇబ్బందులు పెట్టాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీనిపై వైసీపీ నేతలు ఈసీకి నాడు ఫిర్యాదులు చేశారు.  ఈ క్రమంలోనే సీఎంగా జగన్ అయ్యాక ఏబీ వెంకటేశ్వరరావు కథ మారిపోయింది. ఆయనపై కేసు కారణంగా క్రమశిక్షణ చర్యలు తీసుకొని పక్కనపెట్టారు. పోస్టింగ్ ఇవ్వలేదు. అనంతరం కేసు కారణంగా సస్పెండ్ చేశారు.

ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్  ప్రభుత్వం తాజాగా నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా స్టేట్ మెంట్ ఇవ్వాలని ఏబీకి సీఎస్ నీలం సాహ్ని నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా  లేదా వ్యక్తిగతంగా ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  తాజాగా సీఎస్ నీలం సాహ్ని ఏబీని సస్సెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.   1969 ఆలిండియా సర్వీసెస్ రూల్ 8 ప్రకారం చర్యలు తీసుకుంది.  ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

చంద్రబాబు హయాంలో ఇజ్రాయెల్ సంస్థ ఆర్.టి. ఇన్‌ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ నుంచి నిఘా సామగ్రిని కొనుగోలు చేసే విషయంలో అప్పటి నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలు పాటించలేదని.. తన కొడుకు యాజమాన్యంలోని కంపెనీకి కాంట్రాక్టును ఇచ్చి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం విచారణ జరిపి ఫిబ్రవరి 8న వెంకటేశ్వర్ రావును సస్పెండ్ చేసింది.

Also Read: పోలీసులపై దాడి కాదంట.. మసాజ్‌ చేశారట..: విశాఖ పోలీసుల వివరణ

రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ ను సవాలు చేస్తూ నాడు ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ తలుపులు తట్టాడు. కానీ క్యాట్ ఈయన పిటిషన్ ను కొట్టివేసింది. కేసులను నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తరువాత క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఊరట లభించినా వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అనంతరం తాజాగా నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేసింది.

దీన్ని బట్టి ఐదేళ్లు ఉండే నేతల మాయాజాలంలో పడి అధికారులు పనిచేస్తే చివరకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతంతో నిరూపితమైందని అధికార వర్గాల్లో తీవ్రచర్చ జరుగుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్