India team challenges in England : ఎప్పటికప్పుడు భారీ అంచనాలతో ఇంగ్లీష్ గడ్డమీద అడుగుపెట్టడం.. ఆ తర్వాత చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నప్పుడే ఇలా జరిగితే.. ఈసారి మొత్తం అనుభవం లేని ఆటగాళ్లతో టీమిండియా మేనేజ్మెంట్ ఇంగ్లీష్ గడ్డమీద ఏకంగా ప్రయోగం చేస్తోంది. మరి ఈ ప్రయోగం ఫలిస్తుందా? గిల్ ఆధ్వర్యంలో భారత జట్టు విజయం సాధిస్తుందా? భారత జట్టును ఇబ్బంది పెడుతున్న సవాళ్లు ఏంటి? ఈ ప్రతికూలతను టీమిండియా ఎలా అధిగమించాలి? వీటిపై ప్రత్యేక కథనం.
ప్రస్తుత భారత జట్టు యంగ్ ప్లేయర్లతో బలంగా కనిపిస్తోంది.. జైస్వాల్, గిల్, సుదర్శన్, నాయర్, ఈశ్వరన్ వంటి ప్లేయర్లు ఉరకలెత్తే ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఒక రకంగా వీరంతా ఓపెనర్ బ్యాటర్లు. ఇటువంటి వారితో సగం జట్టును మొత్తం నింపేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొత్తం ఓపెనర్ బ్యాటర్లనే ఎంపిక చేస్తే.. మిడిల్ ఆర్డర్ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఎదురవుతుంది.. మిడిల్ కోసం నితీష్, పంత్, జడేజా, జురెల్ లాంటివారు ఉన్నారని.. అయితే నాలుగో స్థానంలో మాత్రం అయ్యర్ లాంటి ప్రత్యేకమైన ఆటగాడిని ఎంపిక చేస్తే బాగుండేదని వాదన వినిపిస్తోంది. ఇక కొన్ని మ్యాచ్లలో గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నప్పటికీ.. అతడు ఇంకా స్థిరపడాల్సిన అవసరం ఉంది. ఒకరకంగా ఇంగ్లీష్ గడ్డ పై ఇంగ్లీష్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ లో భారత మధ్య దళం కాస్త బలహీనంగానే ఉంది.
Also Read : ప్రక్షాళనకు వేళైందా? టీమిండియాలో ఆడనోళ్లలో సాగనంపాలా? చాంపియన్స్ ట్రోఫీకి జట్టులో ఎవరుండాలి?
అనుభవ లేమి
గిల్ సమర్థవంతమైన ఆటగాడే అయినప్పటికీ.. ఆంగ్ల గడ్డమీద అతడికి అనుకున్నంత స్థాయిలో రికార్డు లేదు. ఆంగ్ల జట్టుతో జరిగే సిరీస్లో పూజార, రహానే వంటి వారికి అవకాశం దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ సెలక్టర్లు యువ రక్తానికే అవకాశం ఇచ్చారు. ప్రస్తుత జట్టులో జడేజా మాత్రమే కాస్త సీనియర్ ఆటగాడు. కేఎల్ రాహుల్, బుమ్రా సీనియర్ ప్లేయర్లు అయినప్పటికీ.. బుమ్రా సామర్థ్యం పై ఇప్పటికీ అనుమానమే ఉంది. కేఎల్ సెంచరీ తో టచ్లోకి వచ్చినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ భారం ఒక్కడే ఎలా మోస్తాడు అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. తరుణ్ చాలా రోజుల నుంచి టెస్ట్ ఆడుతున్నప్పటికీ.. అతడు ఏ మేరకు రాణిస్తాడు అనేది చూడాలి. ఇక సుదర్శన్ కూడా కౌంటి క్రికెట్లో ఆడుతున్నప్పటికీ.. అతడు ఏ మేరకు నిలబడతాడనేది ఆసక్తి కరం.
సవాలు ఎదురవుతుంది
ఇంగ్లీష్ బౌలర్లు మన యువ బ్యాటర్లను పదునైన బంతులతో ఇబ్బంది పెడతారనేది వాస్తవం.. ఇక బ్యాటర్లు కూడా బజ్ బాల్ విధానంలో బ్యాటింగ్ చేస్తారు. కొండంత సవాల్ మన ప్లేయర్ల ముందు ఉంచుతారు. ఇది ఒక రకంగా మన బ్యాటర్లను మానసికంగా దెబ్బతీస్తుంది.. బౌలింగ్ దళం కూడా బలంగా కనిపించడం లేదు.. బుమ్రా మీద ఒత్తిడి పెరిగిపోతే మాత్రం అతడు తదుపరి మ్యాచులు ఆడేది అనుమానంగానే ఉంటుంది. షమీ కూడా అందుబాటులో లేడు. సిరాజ్ జట్టులో ఉన్నప్పటికీ నిలకడలేమి అతడిని ఇబ్బంది పెడుతోంది. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధి కృష్ణ, ఆకాష్ ఎలా ఆడతారనేది చూడాల్సి ఉంది. కులదీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ బంతిని ఏ విధంగా తిప్పుతారు అనేది ఆసక్తికరం.. ఇక రవీంద్ర జడేజా పర్వాలేద నిపిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో అతడు గొప్పగా జోరు చూపించిన ఉదంతాలు లేవు. బజ్ బాల్ విధానంలో క్రికెట్ ఇంగ్లీష్ ఆటగాళ్లు.. ఇటీవల కాలంలో ఆ విధానంతో తల బొప్పి కట్టుకున్నారు. గత ఏడాది మనదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లీష్ ప్లేయర్లు బజ్ బాల్ విధానంలో ఒక మ్యాచ్లో గెలిచారు. ఆ తర్వాత అదే విధానంలో మన బ్యాటర్లు బ్యాటింగ్ చేయడంతో ఓటమిపాలయ్యా. ఒకవేళ ఇదే విధానంలో మన వాళ్ళు గనుక బ్యాటింగ్ చేస్తే ఇంగ్లీషు జట్టుకు ఇబ్బంది తప్పదు..