Mafia Films: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడం అనేది చాలా కష్టం… ఎందుకంటే ఒక సినిమాతో సక్సెస్ ని సాధించినంత మాత్రాన స్టార్ డైరెక్టర్లుగా మారిపోరు. వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నప్పుడే వాళ్లు స్టార్ డైరెక్టర్లుగా మారుతారు. వాళ్లకి ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా భారీగా పెరుగుతుందనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే మరికొంత మంది స్టార్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఇక ఒకప్పుడు తెలుగు లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగావేసిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాఫియా కి సంబంధించిన సినిమాలు తీయాలి అంటే ఆయన తర్వాతే ఎవరైనా అనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. బాలీవుడ్ లో ఆయన చేసిన ‘సత్య’ (Satya) సినిమాతో ఓవర్ నైట్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ఆయన మాఫియా సినిమా అంటే ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి తెలిసేలా చూపించాడు. మరి ఈ సినిమా తర్వాత అమితాబచ్చన్ తో సర్కార్, కంపెనీ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇప్పటికి కూడా అతనికి వీరాభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇప్పుడు ఆయన తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటాను అంటూ చెబుతూ ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తున్నప్పటికి ఆయనకున్న విజన్ కి ఇప్పుడు కూడా మంచి సినిమాలు చేయగలిగే కెపాసిటీ అయితే అతనికి ఉందనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమంలోనే ఇకమీదట ఆయన నుంచి ఒక మంచి సినిమా వస్తే చూడాలని తన అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…
Read Also: జిల్లాకు ఒకటి.. ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనను మించిన దర్శకుడు మరెవరు లేరు అంటూ చాలామంది చెబుతూ ఉంటారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇక మీదట రాబోయే సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా అప్పట్లో కొంతమంది దర్శకులు తమదైన రీతిలో భారీ సక్సెస్ ని సాధించడానికి చాలా ఇబ్బందులను పడుతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం మాఫియా కి సంబంధించిన సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఒకరకంగా ఆయనకు మాఫియాతో ఉన్న డీలింగ్స్ కారణంగానే ఆయన మాఫియా మీద అంత పకడ్బందీ ప్లానింగ్స్ తో సినిమాలు చేయగలిగాడు అంటూ కొంతమంది విమర్శకులు సైతం అతని మీద కొన్ని కామెంట్స్ అయితే చేశారు…