India team for Champions Trophy : ఇటీవల పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆ సమయంలో హేజిల్ వుడ్ జట్టును ఉద్దేశించి ఏవో వ్యాఖ్యలు చేశాడని.. వెంటనే బయటికి పంపించింది. అతని స్థానంలో బోలాండ్ ను రంగంలోకి దింపింది. అతడు ఏకంగా టీమిండియాను ఓడించాడు. బౌలింగ్ భారాన్ని కమిన్స్, స్టార్క్ కు మించి మోసాడు. ఇక సిడ్ని టెస్ట్ లో అయితే వన్ మ్యాన్ షో చేశాడు. అందుకే ఆస్ట్రేలియా ఆ స్థాయిలో విజయాలు సాధిస్తోంది. ప్రత్యర్థి జట్లు కుళ్లుకునే విధంగా ట్రోఫీలను అందుకుంటున్నది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్, తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా సాధించింది. మధ్యలో టి20 వరల్డ్ కప్ కోల్పోయినప్పటికీ.. ఆస్ట్రేలియా వెంటనే బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ఆడింది. ఏ సిరీస్ లోనూ ఓటమిని ఒప్పుకోక.. ఓటమి ఎదురైతే విజయం సాధించేదాకా ఆ జట్టు తన క్రికెట్ ప్రయాణాన్ని సాగిస్తోంది. సరిగ్గా ఆస్ట్రేలియా జట్టుతో సమానంగా ఉండే టీమిండియాలో ఈ పరిస్థితి లేదు. ఉదాహరణకు రోహిత్ శర్మనే చూసుకుంటే.. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత తనను తాను నిరూపించుకుని.. సత్తాను చాటిన ఒక్క ఇన్నింగ్స్ కూడా లేదు. విరాట్ కోహ్లీ పెర్త్ టెస్ట్ తర్వాత ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. రాహుల్, గిల్, కూడా ఇదే బాపతు.. ఇలానే నిర్లక్ష్యంగా ఆడుతున్నారు.. దారుణంగా వికెట్లు పోగొట్టుకున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్ ను టీమిండియా కోల్పోయింది. అంతేకాదు బలమైన టెస్ట్ జట్టు అనే మార్క్ ను కూడా కోల్పోతున్నది.
ప్రక్షాళన అవసరం
ప్రస్తుతం టీమిండియాలో ప్రక్షాళన కచ్చితంగా జరగాల్సి ఉంది. ఆడని వాళ్లను పక్కన పెట్టాల్సిన సందర్భం కూడా ఉంది. సిడ్నీ టెస్టులో ప్రసిద్ కృష్ణ తనను తాను నిరూపించుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆటగాళ్లు ఉన్నారు. జట్టుకు కావలసింది విజయాలు.. స్థిరంగా ఆడాల్సిన ఆటగాళ్లు.. బలంగా ఇన్నింగ్స్ నిర్మించాల్సిన ప్లేయర్లు.. వీళ్లు కావాలంటే ఖచ్చితంగా యువ రక్తాన్ని జట్టులోకి ఎక్కించాలి. పోరాటవంతమైన జట్టును రూపొందించాలి. అప్పుడే అప్రతిహత విజయాలు సాధ్యమవుతాయి. ఆస్ట్రేలియా 19 సంవత్సరాల కోన్ స్టాస్ ను రంగంలోకి దింపి.. బుమ్రా పై అటాచ్ చేయించింది అంటే.. ఎంత గొప్ప ప్రణాళిక ఉందో అర్థం చేసుకోవచ్చు. సిడ్నీ టెస్టులో వెబ్ స్టర్ ను ఎదురుదాడికి దిగేలా చేసిందంటే ఎంతటి కసరత్తు ఉందో అవగతం చేసుకోవచ్చు. అందువల్లే ఆటగాళ్లు ప్రాధాన్యంగా పక్కనపెట్టి.. జట్టు ప్రాధాన్యంగా ఆడితేనే విజయాలు సాధ్యమవుతాయి. ఇప్పటికైనా ముంచుకుపోయింది ఏమీ లేదు.. ముందు వచ్చే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని జట్టును రూపొందించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.