ఆ విమర్శలకు తగ్గట్టుగానే ఓపెనర్ల ఆట తీరు కొనసాగుతోంది. రెడ్ బాల్ ఫార్మాట్లో టీమిండియా ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన సిరీస్ లలో చేతులెత్తేశారు. కనీసం ఒక్క ఇన్నింగ్స్ లో కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో ఓపెనర్ల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలకు దిగిన బీసీసీఐ.. ఆటగాళ్లు మొత్తం రంజీ ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రోహిత్ నుంచి మొదలుపెడితే గిల్ వరకు అందరూ రంజీ ఆడారు. ఇందులో వారు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆట తీరును ప్రదర్శించలేదు. ఫలితంగా మాజీ ఆటగాళ్లు మళ్లీ విమర్శలు గుప్పించారు. పైగా ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ ముందు ఉండడంతో.. దానిని గుర్తు చేస్తూ మాజీ ఆటగాళ్లు.. టీమిండియా ఓపెనర్లపై మండిపడ్డారు.
తొలి వన్డేలో విఫలం
గత ఏడాది శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా ఓపెనర్లు విఫలమయ్యారు.. ఆ సిరీస్లో టీమిండియా ఓటమిపాలైంది. ఆ తర్వాత ఏడాది స్వదేశం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. కోల్ కతా లో జరిగిన తొలి వన్డేలోనూ టీమిండియా ఓపెనర్లు విఫలం అయ్యారు. ఈ క్రమంలో ఓపెనర్ల తీరుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో వారు ఒక్కసారిగా తమ లైన్ మార్చారు. కటక్ వేదికగా జరుగుతున్న రెండవ వన్డేలో ఆట తీరు పూర్తిగా మార్చుకున్నారు. ఈ వన్డేలో టీమ్ ఇండియా మేనేజ్మెంట్ యశస్వి జైస్వాల్ కు విశ్రాంతి ఇచ్చింది. గిల్, రోహిత్ ను ఓపెనర్లుగా బరిలోకి దింపింది. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం సరైందని చెబుతూ టీమిండియా ఓపెనర్లు బ్యాటింగ్ చేశారు. తొలి వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వంద బంతుల్లోనే గిల్, రోహిత్ ఈ పరుగులు చేయడం విశేషం. ఈ దశలో రోహిత్, గిల్ తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు.. ఇద్దరూ సెంచరీ వైపుగా పరుగులు తీస్తున్న క్రమంలో..గిల్ (60) ఓవర్టన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో 136 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం రోహిత్ శర్మ(78*) క్రీజ్ లో ఉన్నాడు.
మరి కొద్ది రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో టీమ్ ఇండియా ఓపెనర్లు టచ్ లోకి రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. టీమిండియా దుబాయ్ వేదికగా మ్యాచ్ లు ఆడనుంది.. దుబాయ్ వేదికలపై టీమిండియా కు మెరుగైన రికార్డులు ఉన్నాయి. టీమిండియా ఓపెనర్లు ఇదే స్థాయిలో తమ సత్తా చాటితే చాంపియన్స్ ట్రోఫీ లో తిరుగుండదని.. గత సీజన్లో ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కోల్పోయినప్పటికీ.. ఈసారి సాధించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.