Rohit Sharma : కటక్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండవ వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన అసలు సిసలైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఇన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి.. పరుగులు చేయలేక.. జట్టుకు భారంగా మారిపోయిన అతడు.. ఒక్కసారిగా సింహం లాగా జూలు విదిల్చి తన అసలు రూపాన్ని చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు..కోల్ కతా లో జరిగిన తొలి వన్డేలో విఫలమైన రోహిత్..కటక్ వన్డే కు వచ్చేసరికి ఒక్కసారిగా గేర్ మార్చాడు.. ఓపెనర్ గిల్ తో కలిసి తొలి వికెట్ కు 136 పరుగులు జోడించిన రోహిత్.. గిల్ అవుటయిన తర్వాత.. కోహ్లీ విఫలమైన తర్వాత..కూడా తన దూకుడు తగ్గించలేదు. ఏ మాత్రం భయపడకుండా.. ఇంకేమాత్రం వెరవకుండా తనలోని హిట్ మాన్ ను ఇంగ్లాండ్ బౌలర్లకు పరిచయం చేశాడు.. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు తన పూర్వపులయ అందుకొని ప్రత్యర్థి బౌలర్లకు హెచ్చరికలు పంపాడు.
What a way to get to the HUNDRED!
A treat for the fans in Cuttack to witness Captain Rohit Sharma at his best
Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/oQIlX7fY1T
— BCCI (@BCCI) February 9, 2025
ఇదే క్రమంలో రోహిత్ సెంచరీ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2023లో ఢిల్లీ వేదికగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 63 బంతుల్లో రోహిత్ సెంచరీ చేశాడు.. ప్రస్తుతం కటక్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు. 2018లో నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై 82 బంతుల్లోనే రోహిత్ సెంచరీ కొట్టాడు. 2023లో ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 82 బంతుల్లోనే శతకం కొట్టాడు. 2018లో గౌహతి వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ 84 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ప్రస్తుతం కటక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ ఇంగ్లాండ్ జట్టుపై 83 బంతుల్లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 115 పరుగులు చేశాడు.. సుదీర్ఘకాలం తర్వాత సెంచరీ చేయడంతో రోహిత్ శర్మ పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియా కెప్టెన్ టచ్ లోకి రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది.