https://oktelugu.com/

India vs Afghanistan: అప్ఘనిస్తాన్ పందెంకోడీ.. టీమిండియా ఆదమరిస్తే అంతే సంగతులు

India vs Afghanistan:అప్ఘనిస్తాన్.. ఆదేశం తాలిబన్లతో రక్తసిక్తం అయినా కూడా ఆ దేశ క్రికెటర్లు మాత్రం ఎన్నో దేశాలపై గెలిచి ప్రపంచంలోనే టాప్ 8 జట్లలో ఒకరిగా నిలిచారంటే అతిశయోక్తి కాదు.. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్ లో అప్ఘనిస్తాన్ ఏకంగా బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్ లాంటి జట్లను తోసిరాజని టాప్ లో నిలిచింది. టీ20 వరల్డ్ కప్ కు నేరుగా ఎంపికైంది. అదే సమయంలో బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్ లు క్వాలిఫై మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2021 / 01:28 PM IST
    Follow us on

    India vs Afghanistan:అప్ఘనిస్తాన్.. ఆదేశం తాలిబన్లతో రక్తసిక్తం అయినా కూడా ఆ దేశ క్రికెటర్లు మాత్రం ఎన్నో దేశాలపై గెలిచి ప్రపంచంలోనే టాప్ 8 జట్లలో ఒకరిగా నిలిచారంటే అతిశయోక్తి కాదు.. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్ లో అప్ఘనిస్తాన్ ఏకంగా బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్ లాంటి జట్లను తోసిరాజని టాప్ లో నిలిచింది. టీ20 వరల్డ్ కప్ కు నేరుగా ఎంపికైంది. అదే సమయంలో బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్ లు క్వాలిఫై మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.

    india-afghanistan-match-will-be-a-tough-one

    అంతటి బలమైన అప్ఘనిస్తాన్ టీ20 క్రికెట్ టీం ఇటీవల దాదాపు పాకిస్తాన్ ను ఓడించినంత పనిచేసింది. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ఆసిఫ్ అలీ ఓకే ఓవర్ లో నాలుగు సిక్స్ లు కొట్టబట్టి పాక్ బతికిపోయింది. లేదంటే అధో: గతియే పట్టేది. పాకిస్తాన్ కే చెమటలు పట్టించిన అప్ఘనిస్తాన్ తో ఈరోజు టీమిండియా తలపడుతోంది.

    టీమిండియాను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్ నే భయపెట్టిన అప్ఘనిస్తాన్ తో మ్యాచ్ అంత ఈజీ కాదు.. వరుసగా రెండు ఓటములతో భారత్ జట్టు కుదేలైంది. అదే సమయంలో రెండు విజయాలతో అప్ఘనిస్తాన్ ఊపు మీద ఉంది. నాకౌట్ దశకు కనీసం ఆశలు ఉంచుకోవాలంటే భారత్ ఖచ్చితంగా అప్ఘనిస్తాన్ ను ఈరోజు ఓడించాల్సిందే.

    భారత్ జట్టులో బలమైన భీకర ఆటగాళ్లు ఉన్నా ఈ ప్రపంచకప్ లో ఆడింది లేదు. అంతా తేలిపోయారు. ఇక అప్ఘనిస్తాన్ మాత్రం స్కాంట్లాండ్ , నమీబియాను చిత్తుగా ఓడించింది. పాక్ చేతిలో చివరి నిమిషంలో ఓడింది. సో ఈరోజు భారత్ కు పెను సవాల్ ఖాయం. మరి విజయం సాధిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.