https://oktelugu.com/

Vishal: తిరుమలేశుడిని దర్శించుకున్న హీరో విశాల్​!

Vishal: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భక్తులు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే హీరోలు, సినీ తారలు కూడా ప్రత్యేక సమయాల్లో, తమ సినిమా రిలీజ్​కు ముందుకు స్వామివారి దర్శనార్థం తిరుమలకు వస్తుంటారు. తాజాగా స్టార్​ హీరో విశాల్​ వెంకటేశుడిని దర్శించుకునేందుకు వచ్చారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గాన తిరుమలకు చేరుకున్న విశాల్​ను చూసిన ఆయన అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అయితే, విశాల్​ కూడా అందరితో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 3, 2021 / 01:58 PM IST
    Follow us on

    Vishal: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భక్తులు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే హీరోలు, సినీ తారలు కూడా ప్రత్యేక సమయాల్లో, తమ సినిమా రిలీజ్​కు ముందుకు స్వామివారి దర్శనార్థం తిరుమలకు వస్తుంటారు. తాజాగా స్టార్​ హీరో విశాల్​ వెంకటేశుడిని దర్శించుకునేందుకు వచ్చారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గాన తిరుమలకు చేరుకున్న విశాల్​ను చూసిన ఆయన అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అయితే, విశాల్​ కూడా అందరితో కలిసిపోయి సరదాగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్​గా మారాయి.

    తిరుమలేశుడి దర్శనం అనంతరం నగిరి ఎమ్మెల్యే రోజాను కలిశారు విశాల్​. ఆ తర్వాత మీడియాతో మట్లాడిన ఆయన.. తాను నటించిన ఎనిమి సినిమా దీపావళి కానుకగా విడుదల కానుందని తెలిపారు. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. మరోవైపు, దివంగత నటుడు పునీత్​రాజ్​కుమార్​ గురించి మాట్లాడారు విశాల్​ పునీత్​ తమ ఇంట్లో మనిషని అన్నారు. తాను ఇళ్లు కొనాలని దాచుకున్న డబ్బును పునీత్​ చదివిస్తున్న 1800 మంది విద్యార్ధులకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

    ఇటీవలే ఆయన ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో స్పందించిన విశాల్​.. పునీత్​ ఎంతో గొప్పవ్యక్తిగా పేర్కొన్నారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీతో పాటు, అభిమానులకు తీరని లోటని అన్నారు. ఈ క్రమంలోనే పునీత్​ చేస్తున్న సామాజిక సేవ ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ సందర్భంలోనే ఆయన ఉచితంగా చదివిస్తున్న 1800 పిల్లలను తాను చూసుకుంటానని మాట ఇచ్చారు. దీంతో హీరో విశాల్​ సహృదయానికి ఆయన అభిమానులు ఫిదా అయ్యారు.