IND VS NZ: దుబాయ్ వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియా పేలవమైన ప్రదర్శన కనబర్చింది. హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన టీం ఇండియా గ్రూపు దశలోనే నిష్క్రమించింది. దీంతో టీంఇండియా ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐపీఎల్లో అద్భుతంగా ఆడే ఆటగాళ్లు భారత్ కు మాత్రం సమిష్టిగా ఆడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలోనే ఐపీఎల్ ను సైతం నిషేధించాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి.
టీ 20 తర్వాత టీంఇండియా భారత్ వేదికగా న్యూజిల్యాండ్ తో టెస్టు సీరిస్ కు సిద్ధమైంది. గత విమర్శలకు చెక్ పెట్టేలా టెస్ట్ మ్యాచులో టీంఇండియా ఆటగాళ్లు సమిష్టి ప్రదర్శన చేశారు. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ను ఇరుజట్లు డ్రాగా ముగించగా రెండో టెస్ట్ కీలకంగా మారింది. సిరీస్ గెలువాలంటే ఈ మ్యాచ్ కీలకం కావడంతో ఇరుజట్లు హోరాహోరీగా తలబడటం ఖాయమనే వాదనలు విన్పించాయి.
ఈక్రమంలోనే ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీంఇండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ప్రతిభ కనబర్చడంతో న్యూజిలాండ్ పై 372 భారీ ఆధిక్యంతో భారత్ విక్టరీ సాధించింది. దీంతో 1-0 తేడాతో టెస్టు సీరిస్ భారత్ కైవసం చేసుకొంది. ఇదే సందర్భంలో న్యూజిల్యాండ్ పై టీంఇండియా పలు అదిరిపోయే రికార్డులను నెలకొల్పింది.
భారత్-న్యూజిల్యాండ్ దేశాల మధ్య 12 టెస్టు సిరీసులు జరుగగా న్యూజిల్యాండ్ ఒక్క సిరీస్ కూడా ఇప్పటివరకు గెలువలేకపోయింది. చివరి ఆ జట్టు 1988లో వాంఖడే మైదానంలో ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచింది. తాజాగా ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ భారత్ కు పరుగుల పరంగా భారీ విజయం. 372 పరుగుల తేడాతో భారత్ న్యూజిలాండ్ పై విజయం సాధించింది. అంతకముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికాపై ఉంది. 2015లో ఢిల్లీ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 337 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.
Also Read: India vs New Zealand 2nd Test: టీమిండియా విజయాల బాట పట్టిందా?
న్యూజిలాండ్ పై అశ్విన్ తీసిన వికెట్లు 66. భారత్-న్యూజిల్యాండ్ దేశాల మధ్య జరిగిన టెస్టు మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. అంతకముందు ఈ రికార్డు కివీస్ ఆల్ రౌండర్ రిచర్డ్ హ్యాడ్లీ(65) పేరిట ఉంది. తాజా మ్యాచ్ అశ్విన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అదేవిధంగా స్వదేశంలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఆటగాళ్లలో అశ్విన్(300) రెండోస్థానంలో నిలిచాడు. అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే(350) ఉన్నారు.
ఈ సిరీసులో కివీస్ స్పిన్నర్ అజాజ్ 14/222 గణాంకాలను నమోదు చేశాడు. ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన ప్రపంచ మూడో బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఓ టెస్టు మ్యాచులో భారత్ పై అత్యుత్తమ ప్రదర్శన చూపిన బౌలర్ గా సైతం అజాజ్ నిలిచాడు. మొత్తంగా భారత్ స్వదేశంలో గెలిచిన 14వ టెస్టు సిరీస్ విజయం. టీంఇండియా సమిష్టి భారీ విజయం అందుకోవడతో ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు.
Also Read: India Vs Newzealand: 10కి పది టీమిండియా వికెట్లు కూల్చిన న్యూజిలాండ్ బౌలింగ్ సంచలనం