Telangana govt: తెలంగాణ ప్రభుత్వం ఆరుతడి పంటల వైపు చూస్తోంది. ఇందులో భాగంగా రైతులను సమాయత్తం చేస్తంది. వరి వేస్తే కొనుగోలు చేయమని చెబుతూ రైతులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెబుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వమే వరి సాగు చేయొద్దని చెబుతున్న నేపథ్యంలో ఇక ఎలా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వరి పంటకే అనుకూలమైన భూములు వేరే పంటలకు తట్టుకుంటాయా అని చాలా మంది రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వరి వేయొద్దని బహిరంగంగా చెప్పడంలో ప్రభుత్వం ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా ప్రభుత్వం మాత్రం ఆరుతడి పంటలే సాగు చేయాలని ఘంటాపథంగా చెప్పడంతో అన్నదాతల్లో అయోమయం ఏర్పడుతోంది.
యాసంగిలో వరి పంట వేస్తే కొనుగోల చేయమని చెబుతోంది. కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని ప్రకటిస్తోంది. దీంతో రైతులు ఇతర పంటలు సాగు చేయాలని సూచిస్తోంది. ఇందు కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంపైనే అభాండాలు వేస్తూ తను మాత్రం సులభంగా బయట పడాలని భావిస్తోంది. దీని కోసం రైతులను ఆరుతడి పంటలు సాగు చేయాలని చెబుతోంది.
Also Read: TDP: ఇంటి దొంగల పని పట్టనున్న టీడీపీ?
ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగుతోంది. రైతులను పట్టించుకోని ప్రభుత్వమని నిందలు వేస్తూ తను మాత్రం చక్కగా నడుస్తున్నట్లు నటిస్తోంది. దీంతో ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదని దుమ్మెత్తిపోస్తోంది. రబీలో వేసిన వరి పంటను ఎట్టి పరిస్థితుల్లో కొనబోమని స్పష్టం చేస్తోంది. దీంతో రైతులకు భయం పట్టుకుంది. వరి వేయకపోతే ఎలా అనే సంశయం అందరిలో వ్యక్తమవుతోంది.
Also Read: AP New Capital: ఏపీకి నయా రాజధాని విశాఖ.. ముహుర్తం ఫిక్స్?