IND vs NZ : న్యూజిలాండ్ చేతిలో చావుతప్పి.. కన్నులొట్టబోయినట్టు గెలిచిన టీమిండియా

IND vs NZ : న్యూజిలాండ్ చేతిలో చావుతప్పి.. కన్నులొట్టబోయినట్టు టీమిండియా గెలిచింది. న్యూజిలాండ్ ను 130 పరుగులకే 6 వికెట్లు కూల్చిన సంతోషం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు. న్యూజిలాండ్ చివరి వరుస బ్యాట్స్ మెన్ బ్రాస్ వెల్ రెచ్చిపోయాడు. కేవలం 78 బంతుల్లో 140 పరుగులతో వీరవిహారం చేశాడు. చివరి ఓవర్ వరకూ క్రీజులో నిలిచి న్యూజిలాండ్ ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. చివరి ఓవర్ లో 6 బంతుల్లో కేవలం 19 పరుగులు చేస్తే గెలిచే […]

Written By: NARESH, Updated On : January 18, 2023 10:19 pm
Follow us on

IND vs NZ : న్యూజిలాండ్ చేతిలో చావుతప్పి.. కన్నులొట్టబోయినట్టు టీమిండియా గెలిచింది. న్యూజిలాండ్ ను 130 పరుగులకే 6 వికెట్లు కూల్చిన సంతోషం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు. న్యూజిలాండ్ చివరి వరుస బ్యాట్స్ మెన్ బ్రాస్ వెల్ రెచ్చిపోయాడు. కేవలం 78 బంతుల్లో 140 పరుగులతో వీరవిహారం చేశాడు. చివరి ఓవర్ వరకూ క్రీజులో నిలిచి న్యూజిలాండ్ ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. చివరి ఓవర్ లో 6 బంతుల్లో కేవలం 19 పరుగులు చేస్తే గెలిచే టైంలో చివరి ఓవర్ శార్ధుల్ అందుకున్నాడు. తొలి బంతికే బ్రాస్ వెల్ సిక్స్ కొట్టాడు. దీంతో 5 బంతుల్లో 13 పరుగులు.. న్యూజిలాండ్ గెలుస్తుందని అనుకున్నారు. కానీ శార్ధుల్ బ్రాస్ వెల్ ను ఔట్ చేయడంతో టీమిండియా అతి కష్టం మీద గెలిచినట్టైంది.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీకి తోడు లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్ల ప్రదర్శనతో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీం ఇండియా 50 ఓవర్లలో 349/8 స్కోరు చేసింది, శుభమాన్ గిల్ 208 పరుగులు చేసి తన తొలి డబుల్ సెంచరీని అందించాడు.

తర్వాత న్యూజిలాండ్ త్వరగా వికెట్లు కోల్పోవడంతో ఆరంభం దక్కలేదు. అయితే మైఖేల్ బ్రేస్‌వెల్ మరియు మిచెల్ సాంట్నర్ (57) భారీ భాగస్వామ్యాన్ని సాధించి న్యూజిలాండ్ ను తిరిగి ఆటలోకి తీసుకువచ్చారు. అయితే, మహ్మద్ సిరాజ్ సాంట్నర్ మరియు హెన్రీ షిప్లీలను ఒకే ఓవర్‌లో అవుట్ చేసి న్యూజిలాండ్‌పై కొంత ఒత్తిడి పెంచాడు. తరువాత బ్రేస్‌వెల్ ఇన్నింగ్స్‌ను 140 పరుగులు చేసి ధ్వంసం చేశాడు.

చివరకు బ్రాస్ వెల్ ఔట్ కావడంతో టీమిండియా జట్టు 12 పరుగుల విజయాన్ని సాధించింది. చివరి ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ బ్రాస్ వెల్ ను అవుట్ చేశాడు. సిరాజ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.