Ind Vs Nz Final 2025: చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా సాధిస్తున్న వరుస విజయాలు.. ప్రత్యర్థి జట్ల మాజీ ఆటగాళ్లకు కంటగింపుగా మారాయి. టీమ్ ఇండియా సాధిస్తున్న విజయాలను వారు ఓర్చుకోలేకపోతున్నారు. తాము క్రికెటర్లను అనే విషయాన్ని మర్చిపోయి.. చవకబారు విమర్శలు చేస్తున్నారు. ఇది సోషల్ మీడియా కాలం కావడంతో..నెటిజన్ల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొంటున్నారు..
Also Read: న్యూజిలాండ్ వల్ల మనకు మూడు గాయాలు..CT ఫైనల్లో గెలిచి లేపనం పూయాల్సిందే..
చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వరుస విజయాలు సాధించి.. ఫైనల్స్ వెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ళు సహించలేకపోతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు భారత్ పై రుస రుస లాడారు. దుబాయ్ మైదానం భారత జట్టుకు “అడ్వాంటేజ్” గా మారిందని ఆరోపించారు..” టీమిండియా భద్రత అనే అంశాన్ని సాకుగా చూపిస్తూ దుబాయ్ లో మ్యాచ్ లు ఆడుతోంది. తనకు అనుకూలంగా మైదానాలు రూపొందించుకొని.. వాటిపై ఆడుతోంది. వరుస విజయాలు సాధిస్తోంది. దుబాయ్ మైదానం టీమ్ ఇండియాకు అడ్వాంటేజ్ గా మారిందని” ఆమధ్య పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ఆరోపించారు. ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావిద్ మియాందాద్ చేరాడు. టీమిండియా పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
గెలిచింది అక్కడే కదా
చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్స్ వెళ్ళింది. ట్రోఫీ కోసం న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఇప్పటికే లీగ్ దశలో టీమిండియా, భారత్ పోటీ పడ్డాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో భారత్ గెలిచింది. తక్కువ స్కోరులు నమోదు అయినప్పటికీ భారత్ ఆ లక్ష్యాన్ని సమర్థవంతంగా కాపాడుకుంది. భారత్ చేసిన పోరాటం పట్ల యావత్ క్రికెట్ ప్రపంచం అభినందనలు తెలియజేసింది. అయితే చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో.. ఆ జట్టు మాజీ ఆటగాళ్లు తమ జట్టు ప్లేయర్లను నిందించడం పక్కన పెట్టి టీమ్ ఇండియా మీద పడ్డారు. అందులో జావేద్ మియాందాద్ కూడా ఒకడు. మియాందాద్ భారత్ ఫైనల్ చేరుకోవడం పట్ల చవకబారు వ్యాఖ్యలు చేశాడు. ” టీమిండియా ఫైనల్ వెళ్ళింది. దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కు మా సపోర్టు లభించదు. న్యూజిలాండ్ కు మాత్రమే మా సపోర్ట్ లభిస్తుంది. మేము మాత్రమే కాదు, బంగ్లాదేశ్ కూడా న్యూజిలాండ్ జట్టుకు సపోర్ట్ ఇస్తుంది. భారత్ కు అలా మేము సపోర్ట్ చేయలేం. మా దేశంలో ఆడేందుకు భారత్ ఒప్పుకోలేదు. పైగా దుబాయ్ వేదికగా మ్యాచులు ఆడి.. అడ్వాంటేజ్ తీసుకుంది. అందువల్లే వరుసగా విజయాలు సాధించింది. ఫైనల్ మ్యాచ్లో మాత్రం భారత్ ఓడిపోతుంది. న్యూజిలాండ్ జట్టుకు మేము సపోర్ట్ ఇస్తాం. బంగ్లాదేశ్ వాళ్లు కూడా తమ మద్దతును న్యూజిలాండ్ జట్టుకే తెలియజేస్తారని” జావేద్ వ్యాఖ్యానించాడు. జావేద్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ” దుబాయ్ వేదికగా సాగిన మ్యాచ్లలో పాకిస్తాన్ పై, బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ పై కూడా గెలిచింది. అప్పుడు మీరు ఏం చేశారు? పెగ్గు వేసుకొని తాగి పడుకున్నారా? ఇప్పుడు నిద్ర లేచి శోకాలు పెడుతున్నారా” అంటూ జావేద్ పై మండిపడుతున్నారు.
Also Read: ICC టోర్నీలలో టీమిండియా ఇన్నిసార్లు ఫైనల్ వెళ్ళింది.. ఐనా అతనొక్కడే సెంచరీ చేసింది..