Ind Vs Nz Final 2025: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ (ICC Champions trophy) మరికొద్ది గంటల్లో దుబాయ్ వేదికగా జరగనుంది. భారత్ – న్యూజిలాండ్ ( IND vs NZ) ఫైనల్ మ్యాచ్లో పోటీ పడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. 2000 సంవత్సరం తర్వాత.. మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ అందుకొని న్యూజిలాండ్.. ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని యోచిస్తోంది. మొత్తంగా రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడటం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: మైదానంలో టీమిండియా మీద గెలవలేరు..ఫైనల్ లో మాత్రం కివీస్ కు సపోర్టు.. ఏం బతుకులు రా మీవి?!
దుబాయ్ వేదికగా భారత్ – న్యూజిలాండ్ జట్లు పోటీ పడబోతున్నాయి. ఈ మ్యాచ్ ను యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. రెండు జట్లు బలంగా ఉండడంతో పోటీ హోరాహోరీగా ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ మ్యాచ్ కోసం భారీ ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయని తెలుస్తోంది. నిఘా వర్గాలు కూడా ఈ విషయాన్ని పసిగట్టాయి. బెట్టింగ్ విలువ దాదాపు 5వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇటీవల ఢిల్లీ నేర విభాగ పోలీసులు భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో బెట్టింగులకు పాల్పడుతున్న కొందరిని అరెస్టు చేశారు.. వారి వద్ద ఉన్న లాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కొంతమందిని అరెస్టు కూడా చేశారు. లాప్టాప్ లు, మొబైల్ ఫోన్ ద్వారా కొంతమంది లైవ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని.. డబ్బు, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వారిని విచారిస్తుండగా పోలీసులకు దిమ్మతిరిగిపోయే వాస్తవాలు తెలిసాయి.. ఓ వెబ్సైట్లో మాస్టర్ ఐడిని ఉపయోగించి వారు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కో లావాదేవీ పై మూడు శాతం కమిషన్ తీసుకుంటున్నట్టు వారు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.
ఇంటికి అంతస్థాయిలో కిరాయి చెల్లించి..
బెట్టింగ్ దందా కొనసాగించేవారు ఇళ్లను కిరాయికి తీసుకుంటున్నారు. నెలకు 35 వేల వరకు ఇచ్చి.. వాటిని బెట్టింగ్ కేంద్రాలుగా మార్చేస్తున్నారు. ఫోన్ల సహాయంతో ఆన్లైన్లో పందాలు నిర్వహించి భారీగా వెనకేసుకుంటున్నారు. అయితే ఈ ముఠాలకు సూత్రధారిగా అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావత్ ఇబ్రహీం (Dawood Ibrahim) అని తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం కు చెందిన డీ – కంపెనీ తో ఈ బెట్టింగ్ ముఠా నిర్వాహకులకు సంబంధాలు ఉన్నట్టు సమాచారం. దుబాయ్ వేదికగా డి గ్యాంగ్ ఫైనల్ మ్యాచ్ పై బెట్టింగులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నేరవిభాగ పోలీసులు అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక మరోవైపు కెనడాలో ఓ బెట్టింగ్ యాప్ ను డెవలప్ చేసిన చోటా బన్సల్ అనే వ్యక్తి దుబాయ్ లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక ఢిల్లీకి చెందిన ఇంకో వ్యక్తి కూడా క్రికెట్ స్టేడియం లో ఉంటూ.. అక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు బుకీ లతో పంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసు విచారణలో మనీష్ సాహనీ అనే వ్యక్తి ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని సమాచారం.. నిఘా వర్గాలకు అందిన సమాచారం ఆధారంగా బెట్టింగ్ పై ఉక్కు పాదం మోపుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: న్యూజిలాండ్ వల్ల మనకు మూడు గాయాలు..CT ఫైనల్లో గెలిచి లేపనం పూయాల్సిందే..