Redmi Note 16 Pro 5G: రోజువారి అవసరాల కోసం మొబైల్ వాడేవారికి కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఆకట్టుకునే డివైస్లను మార్కెట్లోకి తీసుకొస్తుంటాయి. వీటిలో Redmi కంపెనీకి చెందిన కొన్ని మొబైల్స్ ఇప్పటికే ఎంతోమంది వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే నేటి తరం వారికి అవసరమయ్యే విధంగా రెడ్మీ నోట్ 16 ప్రో 5G ని త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ యొక్క డిజైన్తో పాటు శక్తివంతమైన ప్రాసెసర్, బలమైన బ్యాటరీ, వేగంగా చార్జింగ్ అయ్యే విధంగా సెట్ అప్ ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం ఆన్లైన్ లో ఈ మొబైల్ కు సంబంధించిన సమాచారం చేర్చారు. ఈ మొబైల్ ఎలా ఉందంటే?
Redmi Note 16 Pro 5G మొబైల్ నిర్మాణానికి డిజైన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లు తెలుస్తోంది. దీనిని చేతిలో పట్టుకుంటే సౌకర్యవంతంగా ఉండనుంది. హ్యాండ్ ఫీల్ తో పాటు మ్యాట్ గ్లాస్ ఉండడంతో వీటిపై ఎలాంటి మరకలు పడినా కూడా.. వేలిముద్రలు పడినా కూడా వాటిని సులభంగా తొలగించే విధంగా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువసేపు మొబైల్ ను ఉపయోగించినా కూడా అలసట రాకుండా స్మూత్ నెస్ ఇస్తుంది. అలాగే ఈ మొబైల్ లో 6.7 అంగుళాల 1.5 K AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది వీడియోలను స్పష్టంగా చూపిస్తుంది. అలాగే గేమింగ్ కోరుకునే వారికి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేయడం వల్ల ఎలాంటి వాతావరణంలో నైనా వీక్షించడానికి అనుకూలంగా ఉంటుంది. ఎక్కువసేపు మొబైల్ చూసినా కూడా ఎలాంటి అలసట రాకుండా ఉంటుంది.
రెడ్మీ కొత్త ఫోన్లో కెమెరా ప్రధానంగా చెప్పబడింది. ఈ మొబైల్లో 200 MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది పగలు లేదా రాత్రి సమయంలో కావాల్సిన ఫోటోలను అందిస్తుంది. జూమ్ చేసినా కూడా స్పష్టంగా చిత్రీకరించే విధంగా కెమెరా ఉండనుంది. సెల్ఫీ కోసం 32 MP కెమెరా పనిచేయనుంది. అలాగే వీడియో రికార్డింగ్ కోసం కూడా అనుగుణంగా కెమెరా పనిచేస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి.. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ కెమెరా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది.
ఈ మొబైల్లో డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ ఉండడంతో రోజువారి మొత్తం ఫోన్ ఉపయోగించినా కూడా వేగంగా యాప్స్ పనిచేస్తుంటాయి. నావిగేషన్ తో పాటు కెమెరా కూడా స్పీడ్ గా వర్క్ చేస్తుంది. అలాగే ఇందులో 12 జిబి వరకు రామ్ ఉండడంతో గేమింగ్ కోసం ఇది స్పీడ్ అప్ చేస్తుంది. గంటల తరబడి మొబైల్ ఉపయోగించినా కూడా వేడి కాకుండా ఉంటుంది. ఇక ఈ మొబైల్లో 5500 mAh బ్యాటరీని చేర్చారు. ఇది ఉద్యోగులు, వ్యాపారులకు రోజంతా ఉపయోగించిన కూడా ఎలాంటి చార్జింగ్ తగ్గకుండా ఉంటుంది. ఈ బ్యాటరీ కి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడంతో డౌన్ టైం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి వస్తే రూ.29,999 ప్రారంభ ధరతో విక్రయించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.