Hyundai Tucson 2026: ఆటోమోబైల్ మార్కెట్లో SUV కార్లను ఉత్పత్తి చేయడంలో Hyundai కంపెనీ ప్రత్యేకత సాధిస్తుంది. దీని నుంచి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఎన్నో మోడల్స్ కార్ల వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కంపెనీ కొత్త కారును అమెరికాలో ప్రవేశ పెట్టబోతోంది. త్వరలోనే ఇది ఇండియాలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. హుందాయి కంపెనీ నుంచి టెక్సాన్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి అలరించింది. అయితే దీనిని నేటి తరం వారికి అందించే విధంగా అప్డేట్ చేసి తీసుకురాబోతుంది.. ఈ కొత్త కారులో ఆధునిక డిజైన్, స్మార్ట్ ఫీచర్స్, సెక్యూరిటీ విషయంలో కేర్ తీసుకుంది. కొత్తగా కారు కొనే వారితో పాటు SUV కారును కోరుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. మరి ఇందులో ఉన్న ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Hyundai నుంచి లేటెస్ట్ గా రాబోతున్న Tucson 2026 ఎక్స్టీరియర్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ కారు ముందటి భాగంలో LED హెడ్ లాంప్స్ ఆధునికరించబడ్డాయి. అలాగే విశాలమైన గ్రిల్, పానెల్ స్టైలిష్ గా ఉంది. మొత్తం బోల్డ్ తో పాటు స్పోర్ట్ కారు వలే డిజైన్ ఆకట్టుకుంటుంది. ఈ కొత్త కారులో శక్తివంతమైన ఇంజన్ చేర్చినట్లు తెలుస్తోంది. ఇది 300 హార్స్ పవర్ తో ఉండనుంది. రోజువారి వినియోగించే వారితో పాటు లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఈ ఇంజన్ అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇందులో సస్పెన్షన్ ట్యూనింగ్, స్టీరింగ్ రెస్పాన్స్ డ్రైవర్లకు మంచి అనుభూతిని ఇస్తాయి.
కొత్తగా వచ్చే టెక్సాన్లో ఇంటీరియర్ డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. లోపల ఆప్స్ క్యాబిన్ ఉండడంతోపాటు సాఫ్ట్ టచ్ సీటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. లేటెస్ట్ ఇన్ఫోటైన్మెంట్ డాష్ బోర్డుతో పాటు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను సెట్ చేశారు. విశాలమైన సీటింగ్ తో పాటు లెగ్ రూమ్ కూడా సౌకర్యవంతంగా ఉండడంతో ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని కలగజేస్తాయి. ఈ కారులో ఉండే కెమెరా 360 డిగ్రీ లేటెస్ట్ టెక్నాలజీ తో పనిచేస్తుంది. ఇరుకైన ప్రదేశాల్లో కూడా సులభంగా వెళ్లే విధంగా నావిగేషన్ పనిచేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ కనెక్టివిటీ ఉన్నాయి.
సెక్యూరిటీ విషయంలోనూ ఈ కారులో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అడాప్ట్ క్రూజ్ కంట్రోల్, లేని కీపింగ్ అసిస్టు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, రియల్ క్రాస్, ట్రాఫిక్ అలర్టు వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. వీటితో ప్రమాదాలను తగ్గించుకొని అవకాశం ఉంటుంది. 2026 లో ఆవిష్కరించబోయే ఈ కారు అమెరికాలో విడుదల కాబోతుంది. దీనిని 30,000 డాలర్లతో అంచనా వేస్తున్నారు. అయితే మరింత సౌకర్యవంతమైన ఫీచర్లు కావాలనుకునే వారికి ధర పెరిగే అవకాశం ఉంటుంది. యూఎస్ లో ఉండేవారికి ఇది ఫుల్ సపోర్ట్ తో పనిచేస్తుందని చెబుతున్నారు.