No Shave November: అబ్బాయిలు.. నో షేవ్ నవంబర్ ట్రెండ్ పాటిస్తున్నారా? లేదా?

మనలో చాలా మందికి ఈ నో షేవ్ నవంబర్ గురించి పెద్దగా తెలియదు. సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యే వారికి ఈ నో షోవ్ గురించి బాగా తెలుస్తుంది. ఇంతకీ ఈ నో షేవ్ నవంబర్ అంటే ఏంటో తెలియాలంటే పూర్తి స్టోరీ చదివేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : November 1, 2024 9:02 pm

No Shave November:

Follow us on

No Shave November:  అబ్బాయిలకు గడ్డం, మీసాలు, జుట్టు ఉంటేనే అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే గడ్డం ఉండే అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే చాలా మంది అబ్బాయిలు కూడా అసలు షేవ్ చేసుకోకుండా గడ్డం, జుట్టు పెంచుతూనే ఉంటారు. అయితే ఇలా జుట్టు ఎక్కువగా ఉంటే పెద్దలకు నచ్చదు. షేవ్ చేసుకుని ఉంటేనే ఇంట్లో వారికి నచ్చుతుంది. లేకపోతే రోజూ దీని గురించి చెబుతూనే ఉంటారు. మరికొందరు అంత గడ్డం పెంచడం ఏం బాగాలేదని, ప్రేమలో ఫెయిల్ అయ్యావా అని అడుగుతారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు గడ్డం పెంచడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇదెలా ఉండగా.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నో షేవ్ నవంబర్‌ను జరుపుకుంటున్నారు. అయితే ఇదేమి ఆచారం కాదు, అలా అని ఇంటర్నేషనల్ డే కూడా కాదు. కేవలం ఒక సామాజిక సందేశం మాత్రమే. అయితే మనలో చాలా మందికి ఈ నో షేవ్ నవంబర్ గురించి పెద్దగా తెలియదు. సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యే వారికి ఈ నో షోవ్ గురించి బాగా తెలుస్తుంది. ఇంతకీ ఈ నో షేవ్ నవంబర్ అంటే ఏంటో తెలియాలంటే పూర్తి స్టోరీ చదివేయండి.

 

ఈ నో షేవ్ నవంబంర్ అంటే పదకొండో నెల అయిన నవంబర్ నెలలో అబ్బాయిలు అసలు పూర్తిగా గడ్డం, మీసాలు, జుట్టు షేవ్ చేసుకోరు. అంటే మొత్తం 30 రోజుల పాటు అసలు ట్రిమ్మింగ్, షేవింగ్ వంటివి చేయరు. కేవలం నెల రోజులు మాత్రమే ఎలాంటి షేవింగ్, ట్రిమ్మింగ్ చేయకుండా ఉంటారు. అయితే కొందరు పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ చేయించుకునే సమయంలో జట్టును కోల్పోతారు. ఈ క్రమంలోనే ఈ నో షేవ్ నవంబర్ వచ్చింది. 2007లో ఓ వ్యక్తి పెద్దపేగు క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత అతని కుమారులు, కుమార్తెలు క్యాన్సర్ నివారణ, అవగాహన, విద్య, పరిశోధన కోసం నిధుల సేకరించడం కోసం 2009లో ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. చివరకు అది నో షేవ్ నవంబర్‌గా మారింది. అలా సోషల్ మీడియా ద్వారా దీనికోసం అవగాహన కార్యక్రమాలు వంటివి చేయడం మొదలు పెట్టారు. దీంతో 2013 నుంచి నో షేవ్ నవంబర్‌ను అమెరికాలో నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది కొందరు నో షేవ్ నవంబర్‌ను పాటిస్తారు.

 

ఈ నో షేవ్ నవంబర్‌ను కేవలం అబ్బాయిలు మాత్రమే కాకుండా మహిళలు కూడా పాటించవచ్చు. అయితే గడ్డం, మీసాలు, జుట్టు అసలు అబ్బాయిలు ఈ నెలలో కత్తిరించరు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నో షేవ్ నవంబర్‌ను పాటిస్తారు. అలాగే క్యాన్సర్‌తో బాధపడిన కొందరికి నవంబర్ తర్వాత కట్ చేసుకున్న జుట్టుని డొనేట్ కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ బారిన పడిన వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని భావిస్తారు. ఈ నవంబర్‌ నెలలో కొన్ని చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోషల్ మీడియాలో కూడా దీని ప్రస్తావన ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు తప్పకుండా ఈ నో షేవ్ నవంబర్‌ను పాటిస్తుంటారు.