https://oktelugu.com/

Ind Vs Nz 3rd Test 2024: ముంబై వాంఖడే లో మాయాజాలం.. ఎవరూ ఊహించని రికార్డు సృష్టించిన రవీంద్ర జడేజా..

ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్ బౌలర్ రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత జట్టు తరఫున టెస్టులలో అత్యధికంగా వికెట్లు పడగొట్టిన ఐదవ బౌలర్ గా ఘనత అందుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 1, 2024 / 04:55 PM IST

    Ind Vs Nz 3rd Test 2024

    Follow us on

    Ind Vs Nz 3rd Test 2024: రవీంద్ర జడేజా ఈశాంత్ శర్మ, జహీర్ ఖాన్ ను అధిగమించాడు. వీరిద్దరూ టెస్టులలో 311 వికెట్లను పడగొట్టారు.. వారి రికార్డును రవీంద్ర జడేజా బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను సొంతం చేసుకున్నాడు. ఫలితంగా ఈ ఘనతను సాధించాడు. టీమ్ ఇండియా తరఫున టెస్టులలో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 132 టెస్టులలో 619 వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ 105 టెస్టులలో 533 వికెట్లు తీశాడు. కపిల్ దేవ్ 131 టెస్ట్ లలో 434 వికెట్లు సాధించాడు. హర్భజన్ సింగ్ 103 టెస్టులలో 417 వికెట్లు సాధించాడు. రవీంద్ర జడేజా 77 టెస్టులలో 314 వికెట్లు పడగొట్టాడు. ఇదంతా కూడా టాప్ -5 లో కొనసాగుతున్నారు. జహీర్ ఖాన్ 92 టెస్టులలో 311 వికెట్లు సాధించాడు. ఈశాంత్ శర్మ 105 టెస్ట్ లలో 311 వికెట్లు నేలకూల్చాడు.

    ఐదు వికెట్లు పడగొట్టి..

    ముంబై వేదికగా జరుగుతున్న మూడవ టెస్టులో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను పడగొట్టడం జడేజాకు ఇది 14వ సారి. రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా చెలరేగి బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ జట్టు ఇబ్బంది పడింది. తొలి ఇన్నింగ్స్ లో 63.5 ఓవర్లలో 235 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. డారిల్ మిచెల్ 82, విల్ యంగ్ 71 పరుగులతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ టామ్ లాతం 28, ఫిలిప్స్ 17 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ప్రారంభంలోనే కాన్వే (4) వికెట్ కోల్పోయింది. ఇతడిని ఆకాష్ దీప్ పెవిలియన్ పంపించాడు. ఇక విల్ యంగ్, లాతం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ భారాన్ని భుజాల మీద వేసుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 44 పరుగులు జోడించారు. అయితే ఈ జోడిని వాషింగ్టన్ సుందర్ విడగొట్టాడు.. ఆ తర్వాత వచ్చిన రచిన్ రవీంద్ర కూడా సందర్భంలో అవుట్ అయ్యాడు. అనంతరం రవీంద్ర జడేజా ఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో పర్యాటక జట్టు 235 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 22 రన్స్ చేసింది. రోహిత్ శర్మ (16), యశస్వి జైస్వాల్ (6) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. కాగా తొలి రెండు టెస్టులలో రవీంద్ర జడేజా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కానీ మూడవ టెస్ట్ లో మాత్రం సత్తా చాటాడు. అద్భుతమైన బంతులు వేస్తూ న్యూజిలాండ్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.