https://oktelugu.com/

Prashanth Neel: ఎన్టీఆర్ కోసం సెంటిమెంట్ ని పూర్తిగా పక్కన పెట్టేసిన ప్రశాంత్ నీల్..ఇది సినిమాకి పెద్ద మైనస్ కానుందా?

ఇటీవలే పూజా కార్యక్రమాలను కూడా మొదలు పెట్టుకున్న ఈ సినిమా, అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోనుంది. ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 1, 2024 / 05:01 PM IST

    NTR And Prashanth Neel

    Follow us on

    Prashanth Neel: ఇటీవల కాలం లో కేవలం రెండు సినిమాలతోనే పాన్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న దర్శకులలో ఒకరు ప్రశాంత్ నీల్. కర్ణాటక చిత్ర పరిశ్రమకి చెందిన ప్రశాంత్ నీల్ ని ఇప్పుడు రాజమౌళి, శంకర్ ని లాంటి దర్శకులను ఇతర భాషల్లో ఎలా అయితే అభిమానిస్తారో, అలా ఈయనని కూడా అభిమానిస్తుంటారు. ఆ స్థాయి బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయనతో సినిమాలు చేసేందుకు మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎంతో అమితాసక్తిని చూపిస్తూ ఉంటారు. ‘కేజీఎఫ్’ చిత్రం భారీ హిట్ అవ్వగానే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించగా, మైత్రీ మూవీ మేకర్స్ వెంటనే ప్రశాంత్ తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ ని వెంటనే సెట్ చేసారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర నిర్మాతలే ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

    ఇటీవలే పూజా కార్యక్రమాలను కూడా మొదలు పెట్టుకున్న ఈ సినిమా, అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోనుంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే ప్రశాంత్ నీల్ తన ప్రతీ సినిమాకి కలర్ గ్రేడింగ్ బ్లాక్ ఫార్మాట్ లో పెట్టే సంగతి అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్, సలార్ చిత్రాలకు బ్లాక్ గ్రేడింగ్ ని ఉపయోగించాడు. కానీ ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాకి కలర్ గ్రేడింగ్ మార్చబోతున్నట్టు ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. బ్లాక్ గ్రేడింగ్ కాకుండా, వేరే డిఫరెంట్ కలర్ ని ఉపయోగించబోతున్నారట. ఇప్పటి వరకు ఆ కలర్ థీమ్ లో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదట. అలాంటి ఫార్మాట్ ని పరిచయం చేసి సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నాడట ప్రశాంత్ నీల్.

    అయితే తనకి బాగా కలిసొచ్చిన బ్లాక్ కలర్ గ్రేడింగ్ ఫార్మాట్ ని పక్కన పెడితే సెంటిమెంట్ దెబ్బ తిని వర్కౌట్ కాదేమో అని ఎన్టీఆర్ అభిమానులు కాస్త భయపడుతున్నారు. ప్రస్తుతం ‘సలార్ 2’ షూటింగ్ లో బిజీ గా ఉన్న ప్రశాంత్ నీల్, ఈ చిత్రం పూర్తి అవ్వగానే ఎన్టీఆర్ సినిమాకి షిఫ్ట్ అవుతాడని తెలుస్తుంది. ఈలోపు ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రీసెంట్ గానే ఎన్టీఆర్ మీద ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఎన్టీఆర్ తో పాటు హ్రితిక్ రోషన్ కూడా మరో హీరో గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు 15 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ రెండవ వారం లోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ త్వరలోనే అధికారికంగా తెలియచేయనున్నారు.