IND vs ENG: టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ మొదలు కాబోతోంది. మంగళవారం నుంచి 3 వన్డేల సిరీస్ మొదలవుతుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ కోల్పోయిన తర్వాత టీమ్ ఇండియా మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే వన్డే సిరీస్ గెలిచి.. సత్తా చూపించాలని టీమిండియా భావిస్తుంది.
ఒకవేళ టీమ్ ఇండియా వన్డే సిరీస్ లో విజయం సాధిస్తే ఇంగ్లాండ్ జట్టు ర్యాంక్ కిందికి జారుతుంది. అప్పుడు టీమ్ ఇండియా పైకి ఎగిసిపోతుంది. టీమిండియాలోకి రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ వచ్చేసారు. వారిద్దరి రాకతో జట్టు బలం మరింత పెరిగింది. బర్మింగ్ హం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇంతవరకు బుమ్రా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఆడలేదు. చాలా రోజుల తర్వాత వీరి ముగ్గురు కలిసి ఆడుతున్న తొలి వన్డే ఇదే.
భారత జట్టుకు గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. రోహిత్.. విరాట్ కోహ్లీ.. కేఎల్ రాహుల్.. శ్రేయస్ అయ్యర్.. సుందర్.. అక్షర్.. కులదీప్.. ప్రసిద్.. బుమ్రా.. కులదీప్ వంటి వారికి జట్టులో చోటు లభించింది. టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియా అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత.. మేనేజ్మెంట్ తుది జట్టులో అనేక మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఓపెనర్లుగా కెప్టెన్ గిల్.. సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ వస్తారని తెలుస్తోంది. ఇంగ్లాండ్ గడ్డమీద రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇతడు 65 సగటుతో పరుగులు చేశాడు. వన్ డౌన్లో విరాట్ కోహ్లీ వస్తాడు. గడిచిన సెప్టెంబర్ నుంచి విరాట్ వన్డేలు ఆడలేదు. అందువల్లే అతడు మైదానంలో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
సారధిగా విఫలమైనప్పటికీ.. అయ్యర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతడు నాలుగో స్థానంలో వచ్చే అవకాశం ఉంది. ఐదో స్థానంలో రాహుల్ వస్తాడని సమాచారం.. ఇషాన్ కిషన్ లేదా దుబే లో ఒకరికి అవకాశం లభించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన సిరీస్ లో కిషన్ అదరగొట్టాడు. ఈ మైదానం మీద ఆరుగురు బ్యాటర్లు అవసరం అనుకుంటే కచ్చితంగా ఇషాన్ కు చోటు లభించే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ సోనీ లైవ్.. జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది..
ఇక ఇంగ్లాండ్ జట్టు కూడా ఈ సిరీస్ కు బలమైన ప్లేయర్లను ఎంపిక చేసింది. ఏడాదిలో ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టు ఎక్కువగా టి20లు.. టెస్టులు ఆడింది. ఆ జట్టు టి20 దృక్పథం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది జనవరి 27న బ్రూక్ సేన చివరి వన్డే ఆడింది.. రూట్ జట్టులోకి రావడంతో బలం పెరిగింది. బట్లర్.. బెతెల్.. బ్రూక్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవల జరిగిన చివరి టి20 మ్యాచ్ లో బట్లర్..బ్రూక్ విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశారు. బౌలింగ్లో ఆర్చర్.. టంగ్.. కరణ్ సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
