IND Vs Eng: రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సడెన్‌గా తప్పుకున్నారు. మెడికల్ ఎమర్జెన్నీ కారణంగా వైదొలిగాడు. అశ్విన్ తల్లి ఆనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన జట్టును వీడి చెన్నై వెళ్లారు. ఈవిషయాన్ని బీసీసీఐ కూడా ధ్రువీకరించింది.
అశ్విన్ స్థానంలో..
ఇక అశ్విన్ గైర్హాజర్ టీమిండియాకు సమస్యగా మారింది. ఆయన తప్పుకోవడంతో ప్రస్తుతం జట్టులో నలుగురు బౌలర్లు మాత్రమే ఉన్నారు. పది మంది ప్లేయర్లు, ఒక సబ్‌స్టిట్యూట్ ఆటగాడితో మూడోరోజు ఆట కొనసాగించారు. అయితే అశ్విన్ స్థానంలో మరొక స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించడం సాధ్యం కాదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆయన స్థానంలో అక్షర్‌పటేల్ లేదా వాషింగ్‌టన్ సుందర్‌ను తీసుకోవచ్చు కదా అని అభిమానులు భావిస్తున్నారు.
నిబంధనలు ఇలా..
ఒక ప్లేయర్ సడెన్‌గా మ్యాచ్‌కు దూరమైతే అతని స్థానంలో మరొకరిని ఆడించవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. కంకషన్ రూల్‌లా అశ్విన్ స్థానంలో మరో స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోవచ్చని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అయితే ఇందుకు ప్రత్యర్థి జట్టు సారథి అంగీకరించాల్సి ఉంటుంది. ఇక ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో రీప్లేస్ చేయవచ్చు. ఇప్పుడు అశ్విన్ స్థానంలో మరో బౌలర్‌ను తీసుకోవాలంటే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంగీకరించాలి.
ప్లేయర్ రీప్లేస్‌మెంట్ ఇలా..
ఒక ప్లేయర్ స్థానంలో మరో ప్లేయర్‌ను ఎప్పుడు తీసుకోవాలి అనడానికి ఐసీసీ రూల్స్ పెట్టింది.
1. ఇరు జట్ల కెప్టెన్లు టాస్‌కు ముందే రీప్లేస్‌మెంట్ ఆటగాళ్ల వివరాలు ఎంపైర్లకు తెలియజేయాలి.
2. సడెన్‌గా ఆట మధ్యలో ఏదైనా కారణంతో ప్లేయర్‌ను మార్చాల్సి వస్తే అప్పుడు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అంగీకారం తప్పనిసరి. అంగీకరిస్తే రీప్లేస చేయవచ్చు.
3. ఇక రీప్లేస్‌మెంట్ ఆటగాళ్లు ఒరిజినల్ ప్లేయర్‌కు ప్రత్యామ్నాయంగానే ఉండాలి.
4. ఒరిజినల్ బ్యాటర్ బ్యాటింగ్/బౌలర్ బౌలింగ్ చేసి ఉంటే.. రీప్లేస్‌మెంట్ ఆటగాడు బ్యాటింగ్/బౌలింగ్ చేయడానికి వీలులేదు.
ఈ నిబంధనల ప్రకారం భారత జట్టు ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నలుగురు బౌలర్లతోనే బౌలింగ్ చేయించాల్సి ఉంటుంది. బెంచ్ ఆటగాళ్లుగా సుందర్, అక్షర్, ఆకాశ్‌దీప్, శ్రీకర్‌భరత్, దేవదత్ పడిక్కల్ ఉన్నా.. వారు రీప్లేస్ ప్లేయర్‌గానే ఉంటారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ind vs eng as ashwin leaves who will replace him what do the rules say
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com