IND vs BAN : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నేపథ్యంలో ఈ టెస్ట్ సిరీస్ సాగుతోంది.. బంగ్లాదేశ్ భారత జట్టుతో రెండు టెస్టులు, మూడు టీ20 లు ఆడుతుంది. ఈ టోర్నీలో రోహిత్ సేన కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ జట్టును వారి సొంత దేశంలో 0-2 తేడాతో బంగ్లాదేశ్ ఓడించింది. మరీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పాకిస్తాన్ జట్టును బంగ్లా 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. దీంతో బంగ్లాదేశ్ జట్టును భారత్ అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. దీంతో తుది జట్టు కూర్పును భారత జట్టు మేనేజ్మెంట్ అత్యంత పకడ్బందీగా చేస్తోంది. ఇందులో భాగంగా వర్ధమాన ఆటగాళ్లు సర్ఫరాజ్, రాహుల్, జురెల్, రిషబ్ పంత్ లో ఎవరికి అవకాశం దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఆటగాళ్ల ఎంపికలో గౌతమ్ గంభీర్ గత గణాంకాలను పూర్తిగా పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో ఆటగాళ్లు చేస్తున్న ప్రదర్శనను ప్రత్యేకంగా గమనించినట్టు అర్థమవుతోంది. అందువల్లే జట్టుకూర్పులో పూర్తిగా గౌతమ్ గంభీర్ మార్క్ కనిపిస్తోంది.
వారికి అవకాశం
బంగ్లాదేశ్ జట్టుతో జరిగే తొలి టెస్ట్ లో ఎవరికి అవకాశం దక్కుతుందో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. ధృవ్ జురెల్, సర్ప రాజ్ ఖాన్ ప్లేయింగ్ -11 లో చోటు దక్కదని, రాహుల్, పంత్ తుది జట్టులో ఉంటారని గంభీర్ స్పష్టం చేశారు. అవకాశం దక్కకపోయినాతో మాత్రాన వారిని పక్కన పెట్టినట్టు కాదని.. తుది జట్టు ఎంపికకు తగ్గట్టుగా ఆటగాళ్లను ఎంపిక చేసామన్నట్టుగా భావించాలని గౌతమ్ గంభీర్ వివరించాడు.
” ఏ ఆటగాడిని కూడా మేము తప్పించే అవకాశం లేదు. పెట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆటగాళ్లను ఎంపిక చేస్తాం.. ధృవ్ జురెల్ అద్భుతమైన ఆటగాడే అయినప్పటికీ.. పంత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా సమర్థవంతమైన ఆటగాడు. ఇలాంటి సమయంలో జట్టు కూర్పు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. పంత్ మెరుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని విధ్వంసం గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతడు బ్యాటింగ్ చేస్తాడు.. వికెట్ కీపింగ్ అదరగొడతాడని” గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. మిగతా ఆటగాళ్లను కూడా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే ఎంపిక చేసామని గంభీర్ వెల్లడించాడు.. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించాడు.. తనకు జట్టు విజయం అంతిమ లక్ష్యం అని గౌతమ్ గంభీర్ వివరించాడు.
తుది జట్టు అంచనా ఇలా
భారత్
రోహిత్ (కెప్టెన్), బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్, గిల్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్.