IND Vs BAN: ఈ ముగ్గురికి భలే బంపర్ ఆఫర్.. బంగ్లా సిరీస్ తో టీమిండియాలోకి ఎంట్రీ.. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరంటే?

జాతీయ మీడియా కథనాల ప్రకారం టెస్ట్ సిరీస్ కు టీమిండియా స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా కు విశ్రాంతి లభించే అవకాశం ఉంది. బంగ్లా పర్యటన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 17, 2024 7:37 am

IND vs BAN

Follow us on

IND vs BAN: శ్రీలంకతో టి20 సిరీస్ గెలిచి, వన్డే సిరీస్ ఓడిపోయిన టీమ్ ఇండియా.. రోహిత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ త్వరలో ప్రారంభం కానుంది. టీమిండియా ఇటీవల శ్రీలంక పర్యటన నుంచి తిరిగి వచ్చింది. సుమారు 45 రోజులపాటు టీమిండియా కు విశ్రాంతి లభించనుంది.. బంగ్లాదేశ్ జుట్టు వచ్చే నెలలో భారత్ లో పర్యటించనుంది.. రెండు టెస్టులు, మూడు టీ మ్యాచ్ లు ఆడనుంది. ఈ టోర్నీ ద్వారా భారత్ తన సొంత గడ్డపై రెడ్ బాల్ క్రికెట్ ఆడుతుంది. గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత.. ఆయన పదవీకాలంలో మొదటి టెస్ట్ సిరీస్ ఇదే.. ఈ క్రమంలో ఈ టెస్ట్ సిరీస్ ను రసవత్తరంగా మార్చడంలో అతడు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం టెస్ట్ సిరీస్ కు టీమిండియా స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా కు విశ్రాంతి లభించే అవకాశం ఉంది. బంగ్లా పర్యటన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఆ సిరీస్ కు బుమ్రా కచ్చితంగా టీమిండియాలో ఉండాల్సిందే. అతని స్థానంలో మహమ్మద్ షమీ ని తీసుకునే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత అతడి కాలికి గాయం కావడంతో.. శస్త్ర చికిత్స నిమిత్తం లండన్ వెళ్లిపోయాడు. చికిత్స చేసుకొని కోలుకుంటున్నాడు. కొంతకాలంగా అతడు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు..

మహమ్మద్ షమీ తో పాటు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ కు జట్టులో అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో అవకాశాలు వచ్చినప్పటికీ ఖలీల్ ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదు. అయితే బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే నైపుణ్యం ఖలీల్ సొంతం.. అటు టి20, ఇటు వన్డేలలో ఎంట్రీ ఇచ్చినప్పటికి.. ఇంతవరకు ఖలీల్ టెస్ట్ క్యాప్ అందుకోలేదు. 26 సంవత్సరాల ఖలీల్ కు అటు దేశవాళి క్రికెట్, ఇటు ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉంది.

ఐపీఎల్ లో 2024లో కోల్ కతా జట్టు తరఫున హర్షిత్ రాణా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. అందువల్లే శ్రీలంక టూర్ లో వన్డే జట్టుకు ఎంపిక అయ్యాడు. అయితే అతడికి ఆడే అవకాశం రాలేదు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్.. బంతిని అనూహ్యంగా స్వింగ్ చేయగలడు. కోల్ కతా జట్టు కు మెంటార్ గా గౌతమ్ ఉన్నప్పుడు హర్షిత్ అద్భుతంగా రాటు తేలాడు. ఇప్పుడు బంగ్లా జట్టు బ్యాటర్లను హర్షిత్ ఇబ్బంది పెడతాడని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు.

ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఎడమచేత్తో బంతిని వేయగల నైపుణ్యం అర్ష్ దీప్ సింగ్ సొంతం. యువ ఫాస్ట్ బౌలర్ బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తాడు. బంతిని మెలి తిప్పడంలో ఇర్ఫాన్ పఠాన్ ను గుర్తు చేస్తాడు. అందుకే ఇతడికి జట్టులోకి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికిఅర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఖలీల్ అహ్మద్ వంటి వారి ఎంపికతో టీమిండియా బౌలింగ్ దళం మరింత వైవిధ్యాన్ని చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.