Ola bike : ఓలా బైక్ కొత్త రోడ్ మ్యాప్.. ప్రపంచ మార్కెట్లతో పోటీ..

భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మూడింటి రెండో వంతు ఓలా కంపెనీ కలిగి ఉంది. భవిష్యత్ లో ఇంతే వేగంతో ఓలా నుంచి కొత్త ఉత్పత్తులు వస్తాయని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు. తాజాగా ఓలా కు సంబందించి మూడు సెగ్మెంట్లను రిలీజ్ చేసింది.

Written By: Srinivas, Updated On : August 16, 2024 9:53 pm

Ola Bike

Follow us on

Ola bike : భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతుంది. టూవీలర్ నుంచి 4 వీలర్ వాహనదారులు తమకున్న పెట్రోల్ వాహనాల స్థానంలో ఈవీలను కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్ కంటే ఈవీలకు ఖర్చు తక్కువగా ఉండడంతో పాటు సులంగా డ్రైవింగ్ విధానం ఉండడం చాలా మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్ ను తేవడంలో OLA కంపెనీ ముందు ఉందని చెప్పవచ్చు. ఓలా తరువాత సుజుకీ, ఏతర్ కంనెనీలు ఈవీలను తీసుకొచ్చినా ఓలాను బీట్ చేయడం లేదు. అయితే తాజాగా ఓలా కంపెనీ మూడు బైక్ లను లాంచ్ చేసింది. ఈ బైక్ లను మార్కెట్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఓలా షేర్స్ దూసుకెళ్తున్నాయి..ప్రస్తుతం ఓలా షేర్స్ ఎలా ఉన్నాయంటే?

భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మూడింటి రెండో వంతు ఓలా కంపెనీ కలిగి ఉంది. భవిష్యత్ లో ఇంతే వేగంతో ఓలా నుంచి కొత్త ఉత్పత్తులు వస్తాయని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు. తాజాగా ఓలా కు సంబందించి మూడు సెగ్మెంట్లను రిలీజ్ చేసింది. వీటిలో రోడ్ స్టర్, రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్ ప్రో ఉన్నాయి. ఇవి దేశీయంగా తయారు చేసిన మోడల్స్. ఇందులో భారత్ కు చెందిన 4680 సెల్, బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. తమిళనాడులోని క్రిష్ణగిరిలో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీలో ఈ బ్యాటరీలను తయారు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రపంచ మార్కెట్లోకి ఓలా దూసుకుపోతుందని కంపెనీ అధినేత పేర్కొన్నారు. ప్రస్తుతం ఓలా కంపెనీ అతిపెద్ద 5వ కంపెనీగా అవతరించిందని అన్నారు. ఇక 4680 సెల్ అయాన్ బ్యాటరీని వచ్చే త్రైమాసికం వరకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. టూవీలర్ లో అతి వేగంగా ఛార్జింగ్ చేయగల ఈ బ్యాటరీ అందుబాటులోకి వస్తే గ్లోబల్ లెవల్లో ఓలా కంపెనీ దూసుకు పోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందు కోసం రోడ్ మ్యాప్ ను కూడా రూపొందించారు.

ఇక ఓలా కంపెనీ అయాన్ బ్యాటరీ అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో ఓలా షేర్స్ దూసుకెళ్లాయి. ఓలా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీఇచ్చిన నేపథ్యంలోనే ఈ కంపెనీ షేర్స్ పెరిగిపోవడం చూస్తే త్వరలోనే ఈ కంపెనీ అనుకున్న విజయం సాధిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో చైనా కు మించి ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఓలా ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కంపెనీ మార్కెట్ విలువ రూ.57,742 కోట్లుగా ఉంది.

ఓలా కొత్తగా ప్రవేశపెట్టిన బైకుల్లో రోడ్ స్టర్ రూ.1,04,999 లక్షలు ఉంది. రోడ్ స్టర్ ఎక్స్ రూ.74,999 గా ఉంది. మరో బైక్ రోడ్ స్టర్ ప్రో రూ.1,99,999తో విక్రయిస్తున్నారు. వీటి డెలివరీ వచ్చే జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. దీపావళి కానుకగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అప్పటి నుంచే బుకింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఓలా త్వరలో క్విక్ కామర్స్ లోకి కూడా ప్రవేశిస్తున్నట్లు పేర్కొంది.