IND vs BAN : బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా గట్టిగా సవాళ్ళు విసరడంతో భారత జట్టు కూడా అప్రమత్తమైంది. ఎందుకైనా మంచిదని ఒకటికి రెండుసార్లు జట్టు కూర్పు విషయంలో సమాలోచనలు చేసింది. అనేక తర్జనభర్జనల తర్వాత కొంతమంది ఆటగాళ్లను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసింది. దీంతో బంగ్లా – భారత్ మధ్య హోరాహోరీగా పోరు సాగుతుందని అందరూ ఒక అంచనాకొచ్చారు. కానీ ఇంతలోనే బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే సంచలన ప్రకటన చేసింది. చెన్నైలోని చిదంబరం మైదానం ఎంతకీ అంతు పట్టడం లేదని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ చందిక హాతరసింఘా. ” మైదానం విచిత్రంగా ఉంది. స్పోర్టింగ్ వికెట్ లాగా కనిపిస్తోంది. కానీ బంతి ఎటువైపు మలుపు తిరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ మైదానం తొలి రోజు నుంచే తన స్వభావాన్ని మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఎలా మలుపు తీసుకుంటుందో అర్థం కావడం లేదు.. చూస్తుంటే సమతూకంతో మైదానాన్ని సిద్ధం చేస్తున్నట్టు వికెట్ సమతూకంగా ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే దానిపై బంగ్లాదేశ్ బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా ఉంది. మైదానం స్పెండర్లకు అనుకూలించినప్పటికీ.. గింగిరాలు తిరిగి అవకాశం లేదని.. బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టే సీన్ ఉండకపోవచ్చని”
హతుర సింఘా వ్యాఖ్యానించాడు.
సీనియర్ క్యూరేటర్ ఏమంటున్నారంటే
చెన్నైలోని మైదానంపై ఓ సీనియర్ క్యూరేటర్ స్పందించారు. ” గత 14 రోజులుగా చెన్నైలో వెదర్ చాలా హాట్ గా ఉంది. 30 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదవుతుంది. అందువల్ల మైదానాన్ని తడపడానికి రోజూ నీళ్లు చల్లాల్సి వస్తోంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ మైదానం స్పిన్నర్లకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. బ్యాటర్లు ఇబ్బంది పడక తప్పదు. మైదానంపై ప్రస్తుతం పచ్చిక ఉంది. అలాంటప్పుడు బంతి ఎటువైపైనా టర్న్ కావచ్చు. అది వికెట్లు తీయడానికి ఆస్కారం ఉంది. అలాంటప్పుడు బంతి పై పట్టు ఉన్న బౌలర్లు మాత్రమే మరింత మెరుగ్గా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆతిథ్య జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. పర్యాటక జట్టుకు ఒకింత ఇబ్బంది ఉంటుంది. అందువల్ల పర్యాటక జట్టు జాగ్రత్తగా ఆడాలి. అర్ధమైదానం కాబట్టి ఆతిథ్య జట్టు రెచ్చిపోయే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం. ఇదే సమయంలో భారత్ లాంటి జట్టును ఢీకొట్టాలంటే బంగ్లాదేశ్ భారీగా బలాన్ని సంతరించుకోవాలి. భారత జట్టులో స్వదేశంలో ఓడించాలంటే పూర్తిస్థాయిలో కసరత్తు జరగాలి. పాకిస్తాన్ జట్టును స్వదేశంలో ఓడించామనే సమీకరణం బంగ్లాదేశ్ కు భారత్ పై సరిపోలకపోవచ్చని” ఆ క్యురేటర్ వ్యాఖ్యానించారు.