Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లో అనేక రకాల ఎమోషన్స్ కంటెస్టెంట్స్ కి ఎదురు అవుతూ ఉంటాయి. అవి కేవలం ఆటలో భాగం మాత్రమే. అంతే కానీ కేవలం ఎమోషన్స్ తోనే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలి అనుకోవడం మూర్ఖత్వం. గత సీజన్ లో కొన్ని అనుకోని కారణాల వల్ల పల్లవి ప్రశాంత్ కి అవి వర్కౌట్ అయ్యాయి. కేవలం అతనికి అవి మాత్రమే వర్కౌట్ అవ్వలేదు. టాస్కులు అద్భుతంగా ఆడాడు. ఆమ్మో వీడు రంగంలోకి దూకాడా?, ఇక మనం ఓడిపోయినట్టే అని ప్రత్యర్థులు ప్రతీ టాస్కులో వణికిపోయేవారు. అందుకే ఆయన టైటిల్ గెలుచుకున్నాడు. కానీ ఈ సీజన్ లో నాగ మణికంఠ అనే కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ మోడల్ ని అనుసరిస్తూ మొదటి ఎపిసోడ్ నుండే తన జర్నీ ని కొనసాగిస్తున్నాడు. ఇది అతనికి మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మొదటి వారం మొత్తం ఇతనొక వింత మనిషి లాగా అనిపించాడు. తన బ్యాక్ గ్రౌండ్ చెప్పుకొని సెంటిమెంట్ పండించాడు. దీనికి ఆయనకు ప్రేక్షకుల నుండి ఓట్లు వస్తాయని అనుకున్నాడు, కానీ అది జరగలేదు, మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్ వరకు అతను వచ్చాడు. కానీ రెండవ వారం తనని తాను మార్చుకునే ప్రయత్నం చేసాడు. టాస్కులలో యావరేజ్ గా ఆడినప్పటికీ, హౌస్ మేట్స్ తో వ్యవహరించే తీరులో పర్వాలేదు అనిపించుకున్నాడు. దాంతో అతని గ్రాఫ్ పెరిగింది, రెండవ వారం ఎలిమినేషన్ రౌండ్ నుండి తప్పించుకున్నాడు. అయితే మూడవ వారం ఆడియన్స్ ఒక సరికొత్త మణికంఠ ని చూస్తున్నారు. హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ ని కౌగిలించుకోవడం, వాళ్లకు ముద్దులు పెట్టడం వంటి కార్యక్రమాలు చేసాడు. యష్మీ వంటి కంటెస్టెంట్స్ కాస్త అసౌకర్యంగా ఫీల్ అయ్యి ఏడ్చేసింది. అలాగే విష్ణు ప్రియా కూడా కామెడీ గానే మాట్లాడుతూ ‘కంటెంట్ కోసం మాటికొస్తే ఇతను అమ్మాయిలను హాగ్ చేసుకుంటున్నాడు. శ్రీ ప్రియా ఇతనికి విడాకులు ఇచ్చేయ్’ అని అంటుంది. ఇలా వింత ప్రవర్తనతో విచిత్రంగా కనిపిస్తున్న మణికంఠ, ఈరోజు తన పాత కోణాన్ని మరోసారి బయటకి తీసాడు.
కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో లో బిగ్ బాస్ ఇచ్చిన గుడ్ల టాస్కుని కంటెస్టెంట్స్ ఆడుతూ కనిపించారు. ఎవరి గుడ్లను వారు దాచుకుంటుండగా ప్రత్యర్థి క్లాన్ కి సంబంధించిన సభ్యులు వాటిని దొంగిలించే ప్రయత్నం చేసారు. దీంతో నాగమణికంఠ కి ఎదో జరిగింది,హౌస్ లోపలకు వెళ్లి గోడకు ఆనుకొని ఏడవడం మొదలు పెట్టాడు. తన క్లాన్ కి చీఫ్ గా వ్యవహరిస్తున్న అభయ్ అతని వద్దకు వచ్చి పలకరించగా ‘నేను ఈ బిగ్ బాస్ గెలవడం చాలా ముఖ్యం. ఈ గేమ్ గెలిస్తేనే నా భార్య బిడ్డ మళ్ళీ నా దగ్గరకు వస్తారు’ అంటూ ఎమోషనల్ డ్రామా మొదలు పెట్టాడు. పూర్తి ఎపిసోడ్ లో అసలు ఏమి జరిగింది, అతను అలా ఎమోషనల్ అవ్వడానికి సరైన కారణం ఉందా లేదా అనేది పూర్తి ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాలి.