Samantha: సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్స్ గా పిలవబడే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు సమంత. ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది. అలాంటి ఇలాంటి హిట్ కాదు, ఈ చిత్రంతో ఆమె స్టార్ హీరోయిన్స్ లీగ్ లోకి అడుగుపెట్టేసింది. ఆ తర్వాత ఆమెకి అవకాశాలు క్యూలు కట్టాయి. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా, కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆమె ముందుకు వెళ్ళింది. అలా వెళ్లడం వల్ల సమంత కి ఉన్న హీరోయిన్స్ అందరిలో ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అలా అంచలంచలుగా ఎదుగుతూ ఇండస్ట్రీ లోకి దూసుకొచ్చిన ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు అమితాసక్తిని చూపించారు. అలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సూపర్ హిట్స్ ని అందుకున్న సమంత తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకుంది.
ఇప్పుడు సమంత ఒక హీరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తే, తన కారణంగా అదనపు మార్కెట్ ఆ చిత్రానికి ఏర్పడుతుంది, ఆ స్థాయిలో ఆమె ఇమేజి పెరిగింది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు, సమంత వ్యక్తిగతంగా కూడా ఎంతో మంది ఆడవాళ్ళకు ఆదర్శంగా నిల్చింది. జీవితం లో ఎదురయ్యే సవాళ్ళను ఎలా సమర్థవతంగా ఎదురుకోవాలో సమంత ని చూసి నేర్చుకోవచ్చు. అయితే సమంత కేవలం సినిమాలలో మాత్రమే టాపర్ కాదు, చదువులో కూడా టాపర్. రీసెంట్ గా ఆమె ఇంటర్ కి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డు ని అప్లోడ్ చేసింది. ఈ ప్రోగ్రెస్ కార్డు లో ఆమెకు ప్రతీ సబ్జెక్టు లోను అద్భుతమైన మార్కులు వచ్చాయి. మొత్తం మీద వెయ్యి మార్కులకు గాను ఆమెకి 888 మార్కులు వచ్చినట్టుగా ఆమె ప్రోగ్రెస్ కార్డు ని చూసి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మ్యాథ్స్ లో ఆమెకి నూటికి నూరు మార్కులు వచ్చాయి. దీనిని బట్టి ఆమె ఏ రేంజ్ స్టూడెంట్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఒకవేళ ఆమె సినిమాల్లోకి రాకపోయుంటే, ఉన్నతమైన జాబ్ లో స్థిరపడి ఉండేది అని ఆమె అభిమానులు సోషల్ మీడియా లో గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే సమంత గత కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం విజయ్ దేవరకొండ తో చేసిన ‘ఖుషి’. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెండితెర పై కనిపించలేదు. అయితే ఆమె అమెజాన్ ప్రైమ్ సంస్థ కోసం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ ని చేసింది. అతి త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ తో పాటు రీసెంట్ గానే కోలీవుడ్ లో ఒక్క పెద్ద ప్రాజెక్ట్ లో నటించేందుకు సంతకం చేసింది.