Ind Vs Aus: టాస్ గెలిచిన భారత జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 150 పరుగులకు కుప్పకూలింది. నితీష్ కుమార్ రెడ్డి (41), రిషబ్ పంత్ (37), కేఎల్ రాహుల్ (26) పరుగులు చేసి ఆకట్టుకున్నారు. మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో ఆ ప్రభావం జట్టు స్కోర్ పై పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ సున్నా పరుగులకే అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ 5 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హెజిల్ ఉడ్ నాలుగు వికెట్లు నేలకూల్చాడు. మార్ష్, స్టార్క్, కమిన్స్ తలా రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. టీమిండియా 150 పరుగులకు అలౌట్ కావడంతో.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది.
67 పరుగులకు 7 వికెట్లు..
భారత జట్టు 150 పరుగులకు ఆల్ అవుట్ అయిన తర్వాత.. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ మొదలుపెట్టింది. 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలలో కూరుకు పోయింది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా జట్టులో క్యారీ(19*) మాత్రమే టాప్ స్కోరర్ గా నిలిచాడు.ప్రస్తుతం క్రీజ్ లో క్యారీ(19*), స్టార్క్(6*) ఉన్నారు. బుమ్రా తో పాటు సిరాజ్ 2/17, రాణా 1/33 అదరగొట్టారు.
మైదానంలో వాగ్వాదం
ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో లబూషేన్ – భారత బౌలర్ సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. సిరాజ్ 13 ఓవర్ వేశాడు. ఈ ఓవర్ లో అతడు సంధించిన మూడో బంతిని లబూషేన్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బంతి అతడు తొడ వద్ద ఉన్న ప్యాడ్ కు ఒక్కసారిగా తగిలింది. అయితే ఆ బంతి గమనాన్ని అంచనా వేయకుండా లబూషేన్ పరుగు తీయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆ బంతి క్రీజు వద్దే ఉందని తెలుసుకొని వెనక్కి వచ్చాడు. ఈ క్రమంలో బంతి వద్దకు బౌలర్ సిరాజ్ రయ్యిమంటూ వచ్చేసాడు. అయితే తనను సిరాజ్ రన్ అవుట్ చేస్తాడని భావించి లబూ షేన్ ఆ బంతిని తన బ్యాటుతో అవతల వైపుకు నెట్టాడు. లబూ షేన్ అప్పటికే క్రీజ్ వద్ద ఉన్నాడు. అయితే తనను బంతిని పట్టుకొని చేసిన అతడిపై సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రన్ అవుట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. తనకు దానిని దక్కకుండా అడ్డుకున్నాడని అంపైర్ కు సిరాజ్ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత సిరాజ్, అతని మధ్య వాగ్వాదం జరిగింది. ఐసీసీ రూల్స్ ప్రకారం వికెట్ల వైపు బంతి వస్తుంటే.. దానిని కారణంగా చూపుతూ ఒక బ్యాటర్ ఆ బంతిని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తనను రన్ అవుట్ చేస్తాడని భావించి ఉద్దేశపూర్వకంగా లబూ షేన్ ఆ బంతిని నెట్టి వేయడంతో ఒకసారిగా వాగ్వాదం నెలకొంది. అంతేకాదు ఆస్ట్రేలియా ఆటగాడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని భారత అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఈ మ్యాచ్లో లబూ షేన్ 12 ఓవర్లో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే సిరాజ్ 21 ఓవర్ లో వికెట్ల ముందు అతడు దొరకబుచ్చుకున్నాడు. లబూ షేన్ 52 బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేశాడు. భారత బౌలర్లను ఎదుర్కోలేక డిఫెన్స్ ఆడాడు. ఒకానొక సందర్భంలో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.
Things are heating up! Siraj and Labuschagne exchange a few words.#INDvsAUS pic.twitter.com/leKRuZi7Hi
— 彡Viя͢ʊs ᴛᴊ ᴘᴇᴛᴇʀ र (@TjPeter2599) November 22, 2024