https://oktelugu.com/

Abhishek Bachchan: కూతురు పుట్టినరోజు వేడుకలకు దూరంగా అభిషేక్ బచ్చన్..మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్!

ట్రిప్ నుండి తిరిగి వస్తున్న సమయంలో విమానాశ్రయంలో వీళ్లిద్దరు కలిసి వస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. దీంతో వీళ్లిద్దరు కలిసే ఉన్నారు, విడిపోతున్నారు అని వస్తున్న వార్తల్లో నిజం లేదని మీడియా కూడా నమ్మింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 / 05:55 PM IST

    Abhishek Bachchan

    Follow us on

    Abhishek Bachchan: గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అనంత్ అంబానీ పెళ్లి లో వీళ్లిద్దరు విడివిడిగా ఉండడం దగ్గర నుండి ఈ రూమర్స్ కి బలం చేకూరింది. అదే విధంగా కబడ్డీ ఈవెంట్ లో అభిషేక్ బచ్చన్ పై ఐశ్వర్య రాయ్ చిరాకు పడడం, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో లీక్ అవ్వడం వంటివి చూసి, కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య రిలేషన్ సరిగా లేదని అందరూ అనుకున్నారు. అయితే అలాంటివేమీ నిజం కాదని , మేమిద్దరం కలిసే ఉన్నాము అంటూ ఐశ్వర్య రాయ్ నేరుగా చెప్పకపోయినా, పరోసఖంగా వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. రీసెంట్ గా వీళ్లిద్దరు తమ కూతురితో కలిసి విదేశీ ట్రిప్ కి వెళ్లారు.

    ట్రిప్ నుండి తిరిగి వస్తున్న సమయంలో విమానాశ్రయంలో వీళ్లిద్దరు కలిసి వస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. దీంతో వీళ్లిద్దరు కలిసే ఉన్నారు, విడిపోతున్నారు అని వస్తున్న వార్తల్లో నిజం లేదని మీడియా కూడా నమ్మింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా వీళ్లిద్దరి కూతురు ఆరాధ్య 13 వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా, ఆమె పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా చేసింది ఐశ్వర్య రాయ్. దీనికి సంబంధించిన ఫోటోలు ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలలో అభిషేక్ బచ్చన్ ఎక్కడా కూడా కనిపించడు. తన పుట్టింట్లో ఈ పుట్టినరోజు వేడుకలు జరిపింది. చనిపోయిన ఆమె తండ్రి ఫోటోకి నివాళులు అర్పించిన ఫోటోలు కూడా ఆమె అప్లోడ్ చేసింది. సుమారుగా 9 ఫోటోలు అప్లోడ్ చేయగా, ఒక్క దాంట్లో కూడా అభిషేక్ బచ్చన్ లేకపోవడంతో మళ్ళీ వీళ్లిద్దరికీ ఏమైంది అనే రూమర్స్ సోషల్ మీడియా లో మొదలైంది.

    ఇలా వీళ్ళ రిలేషన్ ప్రస్తుతం ఎలా నడుస్తుంది అనేది గమనిస్తున్న అభిమానులను అయోమయం కి గురి చేస్తుంది. వీటి అన్నిటికి ఫుల్ స్టాప్ పడాలంటే, ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి బలంగా రూమర్స్ పై స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రెస్ మీట్ అవసరం లేకపోయినా, కనీసం సోషల్ మీడియా లో అయినా వీళ్ళు దీని గురించి స్పందించాలి. అప్పటి వరకు ఈ రూమర్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఐశ్వర్య రాయి చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈమె పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో అద్భుతంగా నటించి, భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. త్వరలో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న పాన్ వరల్డ్ భారీ బడ్జెట్ చిత్రంలో కూడా ఐశ్వర్య రాయ్ ముఖ్య పాత్ర పోషించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.