Ind Vs Aus 4th Test: విరాట్ కోహ్లీ కి టి20 లో మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. వన్డేలలో చెక్కుచెదరని ఘనత ఉంది. కానీ టెస్ట్ క్రికెట్ విషయానికి వచ్చేసరికి ఆ స్థాయిలో విరాట్ కోహ్లీకి రికార్డులు లేవు.. ఘనతలు అంతకన్నా లేవు. రోహిత్ శర్మ కూడా ఇదే వర్తిస్తుంది. టెస్ట్ క్రికెట్ అనేది ప్యూర్ జెంటిల్మెన్ గేమ్ లాంటిది. ఒక ఆటగాడి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో కనబడేలా చేస్తుంది. ఉదాహరణకి 2003లో ఆస్ట్రేలియా ఇండియాలో పర్యటించినప్పుడు.. ఓ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా దాదాపు ఓటమి అంచున నిలిచింది. ఆ సమయంలో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వీరొచిత బ్యాటింగ్ తో.. సమయమనంతో కూడిన ఆటతీరుతో ఇండియాను గట్టెక్కించారు. ఓడిపోయే మ్యాచ్ ను గెలిచేలా చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు కవ్వించినా.. బౌన్సర్లతో ఇబ్బంది పెట్టిన.. షార్ట్ పిచ్ బంతులతో గాయాలు చేసినా.. ఏమాత్రం భయపడలేదు. పైగా పూర్తి సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించి ఆస్ట్రేలియాపై పై చేయి సాధించారు వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్. మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియాకు పుజారా, అజింక్యా రహనే రూపంలో ఆటగాళ్లు దొరికినప్పటికీ వారిని దీర్ఘకాలం కాపాడుకోలేని దుస్థితి. బౌలింగ్లో టీమిండియా కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ.. బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి తేలిపోతుంది.
వైట్ బాల్ ఫార్మాట్ కు అలవాటు పడి..
టీమిండి ఆటగాళ్లు వైట్ బాల్ ఫార్మాట్ కు అలవాటు పడి.. టెస్టులలోనూ వేగవంతంగా ఆడాలని భావిస్తున్నారు. అయితే అన్నిసార్లు ఇది విజయవంతం కాదు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండవ టెస్టులో టీమిండియా వేగవంతంగా ఆడింది. విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అక్కడ వర్క్ అవుట్ అయినట్టు.. మిగతా జట్ల మీద అది సాధ్యం కాదు. అదే టీమ్ ఇండియా ప్రధాన బలహీనతగా మారింది. ఐపీఎల్, టి20 ఫార్మేట్ క్రికెట్ ఎక్కువగా ఆడటం వల్ల టెస్ట్ విషయాన్ని వచ్చేసరికి ఆటగాళ్లు నిలబడలేక పోతున్నారు. అందువల్లే నేటి టీమిండియాకు అజింక్యా రహానే, పూజార లాంటి ఆటగాళ్లే కావాలి. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ కు అలాంటి వారేపనికి వస్తారు. సమయమనం లేకుండా.. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోకుండా.. ఓపికను ప్రదర్శించకుండా టెస్ట్ క్రికెట్ ఆడటమంటే కుక్క తోకను పట్టుకొని గోదావరి ఈదినట్టే .. ఇప్పటికైనా టీం ఇండియా మేనేజ్మెంట్ ఈ ఓటములను దృష్టిలో పెట్టుకొని.. సరికొత్త మార్పులకు శ్రీకారం చుడితేనే టీమిండియా ఒక పట్లగా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. లేకుంటే ఇలానే ఓటములు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా కాకూడదు అనుకుంటే టీమిండియా ఇప్పటికైనా సమూల మార్పులు చేయాల్సి ఉంటుంది.