CM Revanth Reddy: మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ అనారోగ్యంతో డిసెంబర్26(గురువారం)న మరణించారు. 92 ఏళ్ల ఆయనకు యావత్ దేశం ఘనంగా నివాళులర్పించింది. ఆర్థికవేత్తగా, రిజర్వేబ్యాంకు గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా మన్‌మోహన్‌సింగ్ వివిధ హోదాల్లో దేశానికి సేవ చేశారు. ఏ పదవిలో పనిచేసినా ఆ పదవికి వన్నె తెచ్చారు. ఇక ఎలాంటి ఆడంబరాలకు పోలేదు. ప్రధానిగా పనిచేసినా.. చివరి వరకు నిరాడంబర జీవితమే గడిపారు. మన్‌మోహన్‌సింగ్‌కు భార్య,ముగ్గురు కుమార్తెలు ఉపిందర్‌సింగ్, దమన్‌సింగ్ , అమృత్ సింగ్ ఉన్నారు.
మీరేవరని అడిగి..
ఇక మన్‌మోహన్‌సింగ్ మరణ వార్త తెలియగానే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం(డిసెంబర్ 27న) ఢిల్లీ వెళ్లారు. మన్‌మోహన్‌సింగ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మన్‌మోహన్ సింగ్ రెండో కూతురు దమన్‌సింగ్ మీరెవరని ప్రశ్నించారు. దీంతో షాక్ అయిన సీఎం.. వెంటనే తన గురించి పరిచయం చేసుకున్నారు. తాను తెలంగాణ సీఎంను అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ ఘన నివాళి..
ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ మన్‌మోహన్‌సింగ్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈమేరకు సోమవారం(డిసెంబర్ 30న) ప్రత్యేకంగా సమావేశమైంది. సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మన్‌మోహన్‌సింగ్ తెలంగాణ ఆత్మబంధువని తెలిపారు. నీతి, నిజాయతీలో మన్‌మోహన్‌తోపోటీ పడేవారు లేరన్నారు. కేంద్ర ఆర్థిక సలహాదారుగా, ఆర్‌బీఐ గవర్నర్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రధాన మంత్రిగా పని చేశారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మన్‌మోహన్‌సింగే కారణమన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం..
ఇక మన్‌మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో మన్‌మోహన్ సహకారం మరువలేనిదన్నారు. తెలంగాణకు ఆయన ఆత్మబంధువని తెలిపారు. ఆయనను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం, ఆర్టీ చట్టం తెచ్చిన ఘనత కూడా మన్‌మోహన్‌దే అని తెలిపారు.
అంతిమ యాత్రలో పాల్గొంటున్న సమయంలో మన్‌మోహన్ సింగ్ రెండో కుమార్తె నన్ను చూసి ఎవరు మీరు అని అడిగింది – సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/xHKmcUr02u
— Telugu Scribe (@TeluguScribe) December 30, 2024