https://oktelugu.com/

Ind Vs Aus 4th Test: రోహిత్ చెత్త రికార్డు.. ఇంతకంటే దారుణమైన చరిత్ర మరే కెప్టెన్ కు ఉండదేమో..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన వైఫల్య ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. అడిలైడ్ టెస్ట్ నుంచి మొదలుపెడితే మెల్ బోర్న్ వరకు. దారుణమైన ఆట తీరును కొనసాగిస్తున్నాడు. దాదాపు 5 ఇన్నింగ్స్ లలో అతడు వరుసగా విఫలమయ్యాడు. ఇటీవల కాలంలో ఏ ఆటగాడు కూడా ఇంత దారుణమైన ఆట తీరు ప్రదర్శించలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 30, 2024 / 11:50 AM IST
    Follow us on

    Ind Vs Aus 4th Test: న్యూజిలాండ్ సిరీస్లో విఫలమైన రోహిత్.. అదే విఫల ప్రదర్శనను ఇక్కడ కూడా కొనసాగిస్తున్నాడు. మెల్ బోర్న్ మైదానంలో నిలిచి.. గెలిపించాల్సిన సందర్భంగా చేతులెత్తేశాడు. ఓపెనర్ గా వచ్చి వెళ్లిపోయాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క ఫోర్ కూడా లేదంటే రోహిత్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కనీసం అతడు దాడికి దిగాలనే ప్రయత్నం కూడా చేయకపోవడం విశేషం. ఏదో అనామక ఆటగాడిలా.. కొత్తగా జాతీయ జట్టులోకి ప్రవేశించిన ప్లేయర్ లాగా.. చెత్త ఆట ఆడుతూ పెవిలియన్ చేరుకుంటున్నాడు. ప్రత్యర్థి ఆస్ట్రేలియా ప్లేయర్ల ఎదుట చులకన అవుతున్నాడు. ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండడంతో రోహిత్ శర్మ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎందుకు ఆడుతున్నావ్.. రిటర్మెంట్ తీసుకో అన్నట్టుగా విమర్శిస్తున్నారు.

    చెత్త రికార్డు

    మెల్ బోర్న్ మైదానంలో 9 పరుగుల వద్ద రోహిత్ ఔట్ అయిన నేపథ్యంలో అత్యంత చెత్త రికార్డు తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. కమిన్స్ బౌలింగ్ లో మార్ష్ కు క్యాచ్ ఇచ్చి అవుటయిన రోహిత్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఏ కెప్టెన్ నమోదు చేయని దారుణమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చేతిలో ఎక్కువసార్లు అవుట్ అయిన కెప్టెన్ గా రోహిత్ అత్యంత చెత్త ఘనతను సొంతం చేసుకున్నాడు.. ఇంగ్లాండ్ కెప్టెన్ టెడ్ డెక్ సర్ట్ ను ఆస్ట్రేలియా కెప్టెన్ రిచీ బెనాడ్ ఐదుసార్లు అవుట్ చేశాడు. చివరిగా పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ భారత దిగ్గజ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ను టెస్టులలో ఐదు సార్లు అవుట్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కమిన్స్ ఏడు ఇన్నింగ్స్ లలో నాలుగుసార్లు రోహిత్ ను అవుట్ చేశాడు. ఏడు ఇన్నింగ్స్ లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కమిన్స్ బౌలింగ్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు.. మొత్తంగా అతడు 30 పరుగులు మాత్రమే చేశాడు.. కమిన్స్ చేతిలో రోహిత్ ఆరు సార్లు అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్ రిచి బేనాడ్ చేతిలో ఇంగ్లాండ్ కెప్ట టెడ్ డెక్స్ టర్ ఐదుసార్లు అవుట్ అయ్యాడు. ఇమ్రాన్ ఖాన్ చేతిలో భారత దిగ్గజ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఐదుసార్లు అవుట్ అయ్యాడు. రిచి బెనాడ్ చేతిలో గులాబ్ రాయ్ రామచంద్ నాలుగుసార్లు.. కపిల్ దేవ్ చేతిలో లైవ్ లాయిడ్ నాలుగు సార్లు, రిచి బెనాడ్ చేతిలో పీటర్ మే 4 సార్లు అవుట్ అయ్యాడు. మెల్ బోర్న్ టెస్టులో కమిన్స్ చేతిలో అవుట్ అవ్వడం ద్వారా రోహిత్ శర్మ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.