Viral Video : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నది. ఆస్ట్రేలియా విధించిన 340 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీ బ్రేక్ సమయం వరకు మూడు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (63), రిషబ్ పంత్ (28) క్రీజ్ లో ఉన్నారు. రోహిత్ శర్మ (9), విరాట్ కోహ్లీ (5), రాహుల్ (0) దారుణంగా నిరాశపరిచారు.
మెల్ బోర్న్ మైదానంలో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ సమయంలో టీమిండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ దారుణంగా ఫీల్డింగ్ చేశాడు. స్లిప్, సిల్లీ ప్రాంతంలో అతడు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్ లను నేలపాలు చేశాడు. దీంతో రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 200+ పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ చేసిన తప్పు వల్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతసేపటి వరకు యశస్వి జైస్వాల్ తో అతడు మాట్లాడలేదు. అతడు మూడు తప్పిదాలు చేయడంతో నిర్వేదంగా ముఖాన్ని పెట్టాడు. “ఎందుకిలా చేస్తున్నావు.. ఇలా ఫీల్డింగ్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చావా.. ఇలా అయితే ఎలా” అన్నట్టుగా హావభావాలు ప్రదర్శించాడు. ఆదివారం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో మధ్యాహ్నం సెషన్ లో జైస్వాల్ మూడు క్యాచ్ లు జారవిడిచాడు. బుమ్రా బౌలింగ్ లో ఉస్మాన్ ఖవాజా బ్యాట్ అంచుకు తగిలి లెగ్ గల్లీలో బంతి లేచింది. అయితే దానిని పట్టుకోవడంలో జైస్వాల్ విఫలమయ్యాడు.. జైస్వాల్ డిఫెన్స్ కు కాస్త దగ్గర్లో నిలబడి ఉన్నాడు.. ఆకాష్ దీప్ బౌలింగ్ లో లబూషేన్ బంతిని తప్పుగా అంచనా వేసి షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఆ బంతి తక్కువ ఎత్తులో గాల్లో లేచింది. ఆ సమయంలో దానిని క్యాచ్ అందుకోవడంలో యశస్వి జైస్వాల్ విఫలమయ్యాడు. క్యాచ్ వదిలేసిన తర్వాత నాలుక కరుచుకున్నాడు. ” అతడు క్యాచ్ వదిలేసిన తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మ శాంతంగా ఉంటే బాగుండేది. కానీ అనవసరంగా ఆరిచాడని” కామెంటేటర్ మైక్ హాస్సి వ్యాఖ్యానించాడు. ” అతడు ఉద్వేగంగా ఉన్నాడు. వికెట్లు తీసే ప్రక్రియలో తను కూడా భాగస్వామి కావాలని అనుకుంటాడు. కానీ ఒక్కోసారి ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు శాంతంగా ఉండాలి. మద్దతు తెలియజేయాలి. అంతేతప్ప అరిస్తే ప్రయోజనం ఉండదని” హస్సి పేర్కొన్నాడు.
మరో క్యాచ్ కూడా..
49 ఓవర్లో జైస్వాల్ సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో రవీంద్ర జడేజా బౌలింగ్ వేస్తున్నాడు. స్ట్రైకర్ గా కమిన్స్ ఉన్నాడు. జడేజా వేసిన డెలివరీ కమిన్స్ బ్యాట్ తగిలి జైస్వాల్ చేతుల్లోకి వెళ్ళింది. అయితే దానిని పట్టుకోవడంలో జైస్వాల్ విఫలమయ్యాడు. దీంతో రోహిత్ శర్మ మరోసారి కేకలు వేశాడు.. “ఇలా ఎందుకు ఫీల్డింగ్ చేస్తున్నావ్.. ఇలా అయితే కష్టమే” అన్నట్టుగా వ్యాఖ్యానించాడు. ఈ ఘటన జరిగిన తర్వాత కొంతసేపటి వరకు జైస్వాల్ తో రోహిత్ శర్మ మాట్లాడలేదు. ఇక ఇదే క్రమంలో బుమ్రా మళ్లీ తన దూకుడు కొనసాగించడంతో.. ఆస్ట్రేలియా వణికిపోయింది. బుమ్రా 5 వికెట్లతో ప్రదర్శన చేయడంతో ఆస్ట్రేలియా 234 పరుగులకు కుప్పకూలింది. లయన్ (41), బోలాండ్ (15*) పదో వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆస్ట్రేలియా 234 పరుగులు చేయగలిగింది.. టీమిండియా ఎదుట 340 పరుగుల టార్గెట్ విధించింది.
— The Game Changer (@TheGame_26) December 29, 2024