https://oktelugu.com/

Venkatesh and Balayya : వెంకటేష్ బాలయ్య కాంబోలో రావాల్సిన మల్టీ స్టారర్ సినిమాను చివరి నిమిషం లో ఎవరు క్యాన్సీల్ చేశారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 30, 2024 / 11:49 AM IST

    Venkatesh , Balayya

    Follow us on

    Venkatesh and Balayya : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు.మరి తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి చాలా వరకు అసక్తి చూపిస్తున్నారు… బాలయ్య బాబు, వెంకటేష్ లాంటి సీనియర్ నటులు కూడా ఇప్పుడు యంగ్ హీరోలతో పోటీ పడుతూ మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…మరి వీళ్ళ కాంబినేషన్ లో రావాల్సిన మల్టీ స్టారర్ సినిమా ఎందుకు ఆగిపోయిందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి…ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు బాలయ్య బాబు, వెంకటేష్ ఇద్దరూ కూడా చాలా మంచి నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ సైతం తనదైన రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రామానాయుడు ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. కారణం ఏదైనా కూడా పరుచూరి బ్రదర్స్ ఒక మంచి కథను రెడీ చేసినప్పటికి అది కార్యరూపం మాత్రం దాల్చలేదు.

    మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలకు చాలా మంచి గుర్తింపు ఉండడమే కాకుండా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడడానికి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఎదురు చూశారు. కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు. అప్పట్లో రామానాయుడు గారికి ఎన్టీఆర్ కి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉండేది. వాళ్ల సంబంధం తోనే వీళ్లీద్దరితో ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన అనుకున్నాడు. అయితే ఈ సినిమా ఆగిపోవడానికి మెయిన్ కారణం సీనియర్ ఎన్టీయార్ అని కొంతమంది చెప్తూ ఉంటారు…ఎందుకంటే అప్పటికే బాలయ్య కి మాస్ ఇమేజ్ ఉంది. కానీ వీళ్ళు చేద్దాం అనుకుంది క్లాస్ కుటుంబ కథా సినిమా…ఇక దానివల్ల బాలయ్య కి ఎలాంటి ఉపయోగం ఉండదు…కేవలం వెంకటేష్ కి మాత్రమే మంచి ఇమేజ్ వస్తుందనే ఉద్దేశ్యంతో ఆ సినిమాను ఆయన రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది…

    కానీ వర్కౌట్ కాలేదు మరి ఇప్పుడైనా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా చేసే దర్శకుడు ఎవరైనా ఉన్నారా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక రీసెంట్ గా ‘అన్ స్టపాబుల్ షో’ కి అటెండ్ అయిన వెంకటేష్ కూడా ఈ విషయాన్ని చెప్పడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా కనుక వచ్చినట్లయితే మాత్రం భారీ రికార్డులను కొల్లగొట్టడమే కాకుండా ఒక మంచి సినిమాగా ఇండస్ట్రీలో నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ బాలయ్య బాబు ఇద్దరూ సంక్రాంతికి బరిలో దిగుతుండడం విశేషం…ఇక వీరిద్దరి సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఎవరికి వారు వాళ్ళ సినిమాలతో మంచి విజయాలను సాధిస్తామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నప్పటికి ప్రేక్షకులు ఏ సినిమాకి పట్టం కడతారు ఏ సినిమాని రిజెక్ట్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది…