Champions Trophy 2025 Ind Vs Pak: దుబాయ్ మైదానం ప్లాట్ వికెట్ గా ఉంటుంది. బంతి రయ్యిన దూసుకు వస్తుంది. అలాంటప్పుడు బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రిజ్వాన్ తీసుకున్న నిర్ణయం తప్పని భారత బౌలర్లు నిరూపించారు. కులదీప్ యాదవ్ మ్యాజికల్ బంతులతో పాకిస్తాన్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. హార్దిక్ పాండ్యా పదునైన బంతులతో ఇబ్బంది పెట్టాడు. అక్షర్ పటేల్ కీలక సమయంలో దెబ్బతీశాడు. రవీంద్ర జడేజా ఎదురు దెబ్బ తగిలేలా చేశాడు. హర్షిత్ రాణా సుడిగాలి వేగంతో బంతులు వేశాడు. దీంతో పాకిస్తాన్ 241 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
242 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన భారత్ నాలుగు వికెట్ల కోల్పోయి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేశాడు. గిల్ హాఫ్ సెంచరికి దగ్గరలో అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 2017లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో భారత జట్టును ఓడించి ట్రోఫీని అందుకుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ లో ఓడిపోవడంతో పాకిస్తాన్ జట్టుపై రివెంజ్ తీర్చుకోవడానికి భారత జట్టుకు ఇన్ని సంవత్సరాల వరకు అవకాశం లభించలేదు. తీరా భారత్ కు ఇప్పటికి అవకాశం లభించింది. దీంతో దొరికిందే అదునుగా పాకిస్తాన్ జట్టుపై అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే పాకిస్తాన్ ఓటమి నేపథ్యంలో ఆ జట్టుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఓ మహిళ అభిమాని సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ” మా జట్టు ఇలా ఎందుకు ఆడుతుందో తెలియడం లేదు. మా జట్టు ఇలా ఆడటం వల్ల చాలామంది మానసిక ఆరోగ్యాలు ప్రభావితమవుతున్నాయి. మంచిగా ఫీల్డింగ్ చేయండి. మంచిగా బౌలింగ్ చేయండి. మెరుగైన బ్యాటింగ్ చేయండి. అంత తప్ప ఇలా ఓడిపోకండి అంటూ” ఆమె సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ఇంకా చాలామంది అభిమానులు తమ ఆవేదనను ఇలా సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. _”మా జట్టు ఆశలను చిదిమేసింది. పరువును పోగొట్టింది. గర్వభంగాన్ని కలిగించింది. దీనివల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నాం. సోషల్ మీడియాలో మా జట్టుపై తీవ్రస్థాయిల విమర్శలు వినిపిస్తున్నాయి. అభిమానులుగా వీటిని మేము తట్టుకోలేకపోతున్నాం.. మా జట్టు ఎప్పుడు బాగుపడుతుందో అర్థం కావడం లేదని” పాక్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో..పాక్ కు చెందిన ఓ యువతీ సోషల్ మీడియాలో దాయాది జట్టుపై తీవ్ర విమర్శలు చేసింది. మా జట్టుకు ఏమైందో.. ఈ మ్యాచ్ వల్ల ఎంతమంది మెంటల్ హెల్త్ పాడవుతోందని” విమర్శలు చేసింది. #INDvsPAK#ChampionsTrophy2025 pic.twitter.com/KCy2PN7enD
— Anabothula Bhaskar (@AnabothulaB) February 24, 2025